బాబోయ్ ఏంటి పవిత్ర ఆ మాటలు...నీ లిప్ కావాలంటే సప్తగిరి యుద్ధం చేయాలా
on Apr 16, 2025
.webp)
బుల్లితెర షోస్ లో పాగల్ పవిత్ర గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు రెగ్యులర్ గా ఫామిలీ స్టార్స్ లో కనిపిస్తోంది. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి "పెళ్లి కానీ ప్రసాద్" మూవీ టీమ్ వచ్చింది. ఇక సప్తగిరితో పవిత్ర చేసిన కామెడీ వేసిన డైలాగ్స్ మాములుగా లేవు. "వరల్డ్ కప్పు, పవిత్ర లిప్పు దొరకాలంటే చాలా యుద్ధం చేయాలి తెలుసా" అనేసరికి సప్తగిరి అవునా అన్నట్టుగా ఆమె ముఖాన్ని ఆశ్చర్యంగా చూసాడు. "మీకు అదృష్టం వచ్చింది యూజ్ చేసుకో ఓకే నా..ల్యాగ్ చేయకు" అంటూ మంచి అవకాశం ఇచ్చేసరికి.."నేను యుద్ధమే చేస్తా" అన్నాడు సప్తగిరి. "సప్తగిరి ఈరోజు నాపై దాదాగిరి" అంటూ తెగ మురిసిపోయింది.. తర్వాత సప్తగిరి "పవిత్రా ఐ లవ్ యు" అని చెప్పాడు.
"ఐ లవ్ యు టూ" అని చెప్పింది పవిత్ర. ఆ తర్వాత ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సీన్ స్పూఫ్ చేశారు సప్తగిరి , పవిత్ర. మల్లెపూల దండ తెచ్చి పవిత్రలో పెడుతుండగా సుధీర్ మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి "నువ్వు ఆ అమ్మాయికి మల్లెపూలు ఎలా పెడుతున్నావో చూస్తున్నా" అన్నాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ ఐతే "సప్తగిరి లవ్ యు చెప్పాక పవిత్ర ఎక్స్ప్రెషన్స్ సూపర్...పవిత్ర పంచులు మాములుగా లేవు. ఈ ప్రోమో పవిత్ర సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యింది..పవిత్ర, సప్తగిరి స్క్రిప్ట్ ని చించేశారు..పవిత్ర పంచెస్ లో మంచి కిక్కు ఉంటుంది " అంటూ కామెంట్స్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



