Illu illalu pillalu: శ్రీవల్లిని ఏకిపారేసిన నర్మద, ప్రేమ.. స్పృహలోకి వచ్చిన రామరాజు!
on Feb 7, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-388 లో.. అమూల్యతో ప్రేమ, నర్మద మాట్లాడతారు. శ్రీవల్లి చేసిన పనికి అసలు వదలకూడదని ప్రేమ అంటుంది. నాకు మాటిచ్చారని అమూల్య అనగానే అది తిన్నింటి వాసాలు లెక్కపెట్టి నీ జీవితం నాశ చేస్తే ఇంకా మాటని పట్టుకొని వేలాడటం ఏంటి అమూల్య అని ప్రేమ కోపంగా అంటుంది. ఇప్పుడు నిజం చెప్తే శ్రీవల్లి వదిన జీవితం నాశనం అవుతుంది. నాన్న ఏరి కోరి తెచ్చిన సంబంధం.. తను ఇలా చేసిందంటే నాన్న తట్టుకోగలడా అని అమూల్య అంటుంది.
మరోవైపు శ్రీవల్లి ఇంట్లో వంట చేసి హాస్పిటల్ లో ఉన్న వారికి బాక్స్ లు రెడీ చేస్తుంటుంది. అప్పుడే భాగ్యం , ఆనందరావు వస్తారు. వాళ్లు అయాసంగా రావడం చూసి శ్రీవల్లి కంగారుపడతుంది. ఏమైందని అడుగగా అమూల్య హాస్పిటల్ కి వెళ్ళిందని చెప్తారు. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. మనం త్వరగా వెళ్ళి అమూల్య నిజం చెప్పకుండా ఆపాలని తొందరగా రెడీ అయి బయల్దేరుతుంటే అప్పుడే నర్మద వస్తుంది. నర్మదని చూసి శ్రీవల్లి, భాగ్యం, ఆనందరావు షాక్ అవుతారు. ఎక్కడికి అని నర్మద అడుగగా నాలో మానవత్వం ఉంది.. హాస్పిటల్ లో ఉన్నవారి కోసం భోజనం తీసుకెళ్తున్నానని శ్రీవల్లి అంటుంది. మామయ్య హాస్పిటల్ లో ఉండటానికి కారణం నువ్వు.. చేసే గోరాలు అన్నీ చేసి ఏమీ తెలియని నంగనాచిలాగా ఇప్పుడు అన్నం తీసుకెళ్తున్నావా అని నర్మద అంటుంది. నేనేం చేశానని అమూల్య అడుగగా విశ్వని అమూల్య ప్రేమించడానికి కారణం నువ్వు కాదా అని అడుగుతుంది. నాకేం తెలియదని శ్రీవల్లి బుకాయిస్తుంది. ఆ తర్వాత అమూల్యని ప్రేమ తీసుకొస్తుంది. శ్రీవల్లిని ప్రేమ ఇష్టం వచ్చినట్టు తిడుతుంది.
కూతురి కాపురం బాగుండాలని కోరుకోవాలి కానీ ఇలా గోరాలు చేసి నాశనం చేస్తారా అని భాగ్యంతో నర్మద అంటుంది. ఆ తర్వాత నర్మద, ప్రేమ హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడికి నర్మద వాళ్ళ నాన్న వస్తాడు. రామారాజుని చూసి ఎమోషనల్ అవుతాడు. ప్రేమ పెళ్ళి చేసుకున్న ప్రతీ అమ్మాయి తండ్రికి ఇలాంటివి తప్పవు అని నర్మద వాళ్ళ నాన్న అంటాడు. మీరెందుకు వచ్చారు.. వెళ్ళిపోండి అని నర్మద అంటుంది. ఇక సాగర్ తో మాట్లాడాలని పక్కకి రమ్మని పిలుస్తాడు నర్మద వాళ్ళ నాన్న. ఏమైంది డబ్బు రెడీ చేసుకున్నావా.. రేపే లాస్ట్ డే.. వెళ్లి డబ్బు కట్టి జాబ్ కన్ఫమ్ చేసుకోమని నర్మద వాళ్ళ నాన్న అనగానే సరేనని సాగర్ అంటాడు. ఆ తర్వాత రామరాజు స్పృహలోకి వస్తాడు. అది చూసి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



