ENGLISH | TELUGU  
Home  » TV News

Brahmamudi : చక్రవర్తిని కాపాడిన రాజ్.. గడువులోగా మినిస్టర్ నిజం చెప్తాడా!

on Feb 6, 2026


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -948 లో..... మినిస్టర్ కి రాజ్ ఫోన్ చేస్తాడు‌. డాక్టర్ చక్రవర్తిని తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్తున్నాను.. అతను నీ గురించి నిజం చెప్పేస్తాడని రాజ్ అంటాడు.  రాజ్ అలా అనగానే మినిస్టర్ భయపడతాడు. చక్రవర్తి ని దాచిన ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ చక్రవర్తిని చూసి రిలాక్స్ అవుతాడు. అప్పుడే రాజ్ ఫోన్ చేసి నా ప్లాన్ చేంజ్ చేసుకున్నాను.. నీకు హెల్ప్ చేసిన నర్సు నీలవేణి దగ్గరికి వెళ్లి సాక్ష్యం సంపాదిస్తానని రాజ్ అనగానే మళ్ళీ  నీలవేణి దగ్గరికి వెళ్తాడు మినిస్టర్.

మినిస్టర్ వెళ్లడంతో చక్రవర్తి దగ్గరికి రాజ్ వచ్చి రౌడీలని కొట్టి చక్రవర్తిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత మినిస్టర్ నీలవేణి దగ్గరికి వెళ్తాడు. నువ్వు రాజ్, కావ్య వాళ్లతో చేతులు కలిపి నా గురించి నిజం బయట పెట్టాలని చూస్తున్నావా అని నీలవేణిని మినిస్టర్ బెదిరిస్తాడు. నేను ఏం చెప్పలేదు సర్.. వాళ్ళే నిజం తెలుసుకొని నా దగ్గరికి వచ్చారు. నిజం ఒప్పుకున్నాను కానీ నన్ను ఇందులోకి లాగొద్దని నేను రిక్వెస్ట్ చేసాను.‌‌. నా వళ్ళ మీకు సంబంధించినవి ఏవి బయటకు రావని నీలవేణి చెప్తుంది. అప్పుడే రాజ్ ఫోన్ చేసి యుద్ధం ఎక్కడ మొదలైందో అక్కడికి చక్రవర్తిని తీసుకొని వెళ్తున్నానని రాజ్ అనగానే అంటే హాస్పిటల్ అని మినిస్టర్ కంగారుగా వెళ్తాడు.

ఆ తర్వాత తులసితో చక్రవర్తి మాట్లాడుతాడు. రాజ్ కావ్య అక్కడే ఉంటారు. తులసితో చక్రవర్తి మాట్లాడుతుంటే అప్పుడే ఎక్కడ నిజం చెప్తున్నారోనని మినిస్టర్ కంగారుగా వచ్చి తులసి వాళ్ళు చెప్పింది.. ఏం నమ్మకు అని అంటాడు. వాళ్ళేం చెప్పారు ఆయుర్వేద డాక్టర్ గురించి మాట్లాడుతున్నామని తులసి చెప్పి.. లోపల డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి భయపడ్డావా నీకు ఇచ్చిన గడువులో నువ్వే నీ భార్యకి నిజం చెప్పి.. నా బిడ్డని నా చేతిలో పెట్టాలని కావ్య వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత రాజ్, కావ్య డాక్టర్ తో తులసి పాప హెల్త్ కండిషన్ గురించి మాట్లాడతారు. పాప ఆరోగ్యం ఇప్పుడు బానే ఉంది‌ ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుందని డాక్టర్ చెప్పగానే ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ ఇంటికి వస్తారు. అప్పుకి డెలివరి డేట్ ఇచ్చారని ఇంట్లో అందరికి కళ్యాణ్ స్వీట్స్ పంచుతాడు. అప్పుడే రాజ్, కావ్య వచ్చి పాప హెల్త్ కండిషన్ బాగుందట డాక్టర్ చెప్పిందని అంటారు. దాంతో ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.