నువ్వు నన్ను నిద్ర పోనివ్వవా రష్మీ..!
on Mar 14, 2025
బుల్లితెర మీద యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షోకి, శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి యాంకర్ గా పని చేస్తోంది. అలాగే మూవీస్ లో హీరోయిన్ గా కూడా నటిస్తోంది. రష్మీ షోస్, ఈవెంట్స్ లో ఫుల్ ఎనర్జీతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల వీడియోస్, ఫోటో షూట్స్ అన్నీ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. (Rashmi Gautam)
హోలీ పండగ సందర్భంగా తాజాగా కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది రష్మీ. వైట్ డ్రెస్ లో కలర్ ఫుల్ చున్నీలో ఎంతగా మెరిసిపోతోందో చెప్పక్కర్లేదు. మంచి క్యూట్ గా ఉన్న ఆ పిక్స్ చూసిన నెటిజన్స్ ఐతే కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ కొంటెగా "నువ్వు నన్ను నిద్రపోనివ్వవా రష్మీ" అంటూ కామెంట్ పెట్టారు. మిగతా వాళ్ళైతే "హోలికే రష్మీ అందమైన రంగులు పూసింది. అందరూ చందమామను టెలీస్కోప్ లో చూస్తారు కానీ నేను నా చందమామను నా కళ్ళతో చూస్తాను." అంటూ రష్మీ గురించి క్యూట్ కామెంట్స్ చేస్తూ హ్యాపీ హోలీ అంటూ విషెస్ చెప్పారు. ఇక రష్మీ ఐతే "ఇలా నవ్వులతో, సంతోషంతో నా జీవితాన్ని రంగులమయం చేసుకుంటున్నా" అంటూ కామెంట్ పెట్టింది.
రీసెంట్ గా తన పెట్ చుట్కి అస్థికలను గోదావరిలో కలిపొచ్చింది రష్మీ. తన పెట్ తో గడిపిన క్షణాల వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అలాగే రష్మీ రోడ్డు మీద కనిపించే మూగ జీవాలకు హెల్ప్ చేస్తుంది, వాటికీ షెల్టర్ ఏర్పాటు చేస్తూ, ఇంటరెస్ట్ ఉన్నవారి చేత కూడా చేయిస్తూ ఉంటుంది. అలాంటి రష్మీ ఇప్పుడు హోలీ పండగ రోజున అందంగా మెరిసిపోతోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
