Karthika Deepam2 : ఆస్తులన్నీ దశరథ్ కూతురు పేరున రాసిన శివన్నారాయణ... షాక్ లో జ్యోత్స్న!
on Mar 12, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -302 లో..... శివన్నారాయణ లాయర్ ని పిలుస్తాడు. వీలునామా అందరి ముందు చదవమని చెప్తాడు. దంతో లాయర్ చదవడం మొదలుపెడతాడు. ఈ యావధాస్తిని నా కొడుకు, కోడలు పేరున రాస్తున్నాను. ఆ తర్వాత ఆస్తులన్నీ తన కూతురికి చెందుతాయని చదువుతాడు. అది విని జ్యోత్స్న షాక్ అవుతుంది. ముసలోడు ఎక్కడ నా పేరు మెన్షన్ చెయ్యలేదు. సుమిత్ర, దశరథ్ ల కూతురు అంటే దీప అవుతుందని జ్యోత్స్న అనుకుంటుంది
మరి నాకేం రాయలేదా అని పారిజాతం అనగానే.. ఊరు చివర డైరీ ఫామ్ ఉంది కదా అది నీకే అని శివన్నారాయణ అంటాడు. ఇది ఒక్క వీలునామా మాత్రమే ఇంకొక వీలునామా ఉందని లాయర్ అనగానే మరి చదవండి అని పారిజాతం అంటుంది. అది ఇప్పుడు చదవద్దు.. నేను చనిపోయినంక చదవాలని శివన్నారయణ అంటాడు. నాన్న మొత్తం రాసారు. మీకంటూ ఏం ఉంచుకోలేదని దశరథ్ అడుగుతాడు. నాకు మీరు ఉన్నారన్న ధీమా అని శివన్నారాయణ అంటాడు. మరి చెల్లికి ఏం రాయలేదని దశరథ్ అడుగుతాడు. దాంతో పారిజాతం వెటకారంగా మాట్లాడుతుంది. ఒక నాకు తప్ప అందరికి అన్యాయం జరిగిందని దశరథ్ అనుకుంటాడు.
నీకు అయితే న్యాయం జరిగింది.. మొత్తం నీ పేరున ఆస్తులు రాసారు. సుమిత్ర, దశరథ్ ల కూతురు అంటే నువ్వే కదా అని పారిజాతం అంటుంది. అసలైన వారసురాలు వస్తే అని జ్యోత్స్న అనగానే రాదని పారిజాతం అంటుంది. పారిజాతం శ్రీధర్ కి ఫోన్ చేసి వీలునామాలో ఏం రాసారని చెప్తుంది. కాంచన పేరున రాయలేదని తెలిసి శ్రీధర్, కార్తీక్ దగ్గరికి వెళ్లి ఈ పేపర్ పై సంతకం పెట్టమని అడుగుతాడు. ఎందుకని అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



