Karthika Deepam2 : రిపోర్ట్స్ ఇవ్వమని అడిగిన దశరథ్.. టెన్షన్ లో డాక్టర్!
on Feb 18, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -596 లో.. జ్యోత్స్న వచ్చి డాక్టర్ ని ఏం అడిగిందో డాక్టర్ మొత్తం కార్తీక్, దాస్ కి చెప్తుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి కార్తీక్ ఎందుకంటే జ్యోత్స్నకి డౌట్ వచ్చింది. వీలైనంత త్వరగా మీరు నిజం చెప్తే మంచిది అని కార్తీక్ తో డాక్టర్ చెప్తుంది. ఇప్పుడే నిజం చెప్తానని దాస్ బయల్దేరతాడు. తన వెనకాల కార్తీక్ వెళ్తాడు. మరొకవైపు జ్యోత్స్న ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్లావని పారిజాతం అడుగుతుంది. డాక్టర్ హారిక గారిని కలవడానికి వెళ్ళాను.. ఈ విషయం ఇంట్లో తెలియవద్దని జ్యోత్స్న అంటుంది. అప్పుడే ఎందుకు అంటూ దశరథ్ వస్తాడు. నువ్వు ఎందుకు డాక్టర్ ని కలిసావ్.. ఎందుకు ఇంట్లో తెలియొద్దు అంటున్నావని దశరథ్ అడుగుతాడు. అప్పుడే శివన్నారాయణ వస్తాడు.
నా టెన్షన్ నాకు ఉంటుంది కదా మీకేందుకు టెన్షన్ అని జ్యోత్స్న అంటుంది. తల్లిని కాపాడడానికి జ్యోత్స్న పెద్ద బాధ్యత తీసుకుందని జ్యోత్స్నకి పాజిటివ్ గా శివన్నారాయణ మాట్లాడతాడు. జ్యోత్స్న ఎన్ని చెప్పినా నాకు తనపై అనుమానంగానే ఉందని దశరథ్ అనుకుంటాడు. మరొకవైపు, దీప దగ్గరికి శ్రీధర్ వస్తాడు. కార్తీక్ ని ఎన్నోసార్లు మీ అమ్మని నన్ను కలపమని అడిగాను.. ఎప్పుడు కూడా సరే అనలేదు కానీ ఎందుకు వాళ్ళ అమ్మతో అలా అన్నాడని దీపని శ్రీధర్ అడుగుతాడు. నేను వెళ్ళొస్తా అమ్మ నీ కడుపులో బిడ్డ జాగ్రత్త.. ఇప్పుడు కాంచన ప్రాణాలన్నీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డపైనే ఉన్నాయని శ్రీధర్ అనగానే దీప ఏడుస్తుంది. మరొకవైపు దాస్ నిజం చెప్పడానికి వెళ్తుంటే కార్తీక్ ఆపుతాడు. ఆ రోజు కూడా ఇలాగే తొందరపడి వెళ్ళావ్.. నేను వచ్చేసరికి లేవు.. ఏమైపోయావని కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్న కిడ్నాప్ చేసిందని దాస్ చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు.
దీపని చంపాలని రౌడీలని పంపించింది కూడా జ్యోత్స్ననే అని దాస్ చెప్తాడు. ఇప్పుడు చెప్పు కార్తీక్.. ఆ జ్యోత్స్నని వదిలేద్దమా అని దాస్ అడుగుతాడు. మరొకవైపు డాక్టర్ హారికని కలవడానికి దశరథ్ వెళ్లి జ్యోత్స్న రిపోర్ట్స్ కావాలి.. మ్యాచ్ అవ్వనివి మ్యాచ్ అయినవి సెకెండ్ ఒపీనియన్ కోసమని దశరథ్ అనగానే ఇప్పుడు ఇస్తే నిజం తెలిసిపోతుందని డాక్టర్ అనుకుంటుంది. ఈ విషయం కార్తీక్ కి చెప్పాలి.. ఇప్పుడు తప్పించుకోవాలని డాక్టర్ అనుకొని దశరథ్ గారు మీకు మెయిల్ చేస్తాను. నాకు ఇప్పుడు ఆపరేషన్ ఉందని చెప్తుంది. సరే మెయిల్ చెయ్యండి అని దశరథ్ అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు నిజం చెప్పడం వద్దు మావయ్య ఎందుకంటే అత్త పరిస్థితి బాలేదని దాస్ ని కార్తీక్ కన్విన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



