ENGLISH | TELUGU  
Home  » TV News

Illu illalu pillalu : ఎస్సై ఎగ్జామ్ రాసిన ప్రేమ..‌ ఆ వీడియోతో సాగర్ ని భాగ్యం ఇరికిస్తుందా!

on Feb 18, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -397 లో..... ప్రేమకి ధీరజ్ సర్ ప్రైజ్ అని చెప్పి ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తాడు. ఈ పంచభూతాల సాక్షిగా ఒక విషయం చెప్పాలని అంటాడు. ప్రేమ ఆత్రుతతో వెయిట్ చేస్తుంది. ప్రేమకి రోజ్ ఫ్లవర్ ఇచ్చి.. తన ప్రేమ విషయం చెప్పి ప్రేమని ఎత్తుకున్నట్లు ధీరజ్ ఉహించుకుంటాడు. అయ్యో అసలు విషయం చెప్పలేదా అని ప్రేమ దగ్గరికి వెళ్లి చెప్పబోతుంటే ఒక చిన్న  అమ్మాయి పరుగెడుతుంటే వాళ్ళ అమ్మ అమూల్య అని పిలుస్తుంది. దాంతో ధీరజ్ ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని జాగ్రత్త అమ్మ అని చెప్తాడు.

అమూల్య అని పేరు వినగానే తను ప్రేమకి ప్రపోజ్ చెయ్యాలన్న మూడ్ పోతుంది. కోపంగా బయటకు వస్తాడు. అమూల్య పేరు వినగానే అలా అయిపోయావ్ ఏంట్రా అని ప్రేమ అడుగుతుంది. అసలు మా చెల్లి అలా చెయ్యదు దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలని ధీరజ్ అనగానే దానికి కారణం నేనే అని తెలిస్తే నన్నేం చేస్తాడోనని ప్రేమ భయపడుతుంది. సాగర్ వర్క్ లో జాయిన్ అవుతాడు. రోడ్డు పక్కన ల్యాండ్ సర్వే చేస్తూ ఉండగా.. తనకి జాబ్ ఇప్పించిన అతను వచ్చి మొన్న నువ్వు ఇచ్చిన డబ్బు వాళ్ళకి వీళ్ళకి అయ్యాయి.. ఒక పదివేలు ఇమ్మని జేబులో లో నుండి తీసుకుంటాడు సాగర్ భయపడుతాడు. అదంతా అటుగా వెళ్తున్న భాగ్యం, శ్రీవల్లి చూస్తుంది. వాడు ఎందుకు డబ్బు తీసుకున్నాడు. సాగర్ ఏం అనట్లేదు.. ఇదేదో మనకి పనికొచ్చే విషయం అని అతను డబ్బు తీసుకొని లెక్కేస్తున్న వీడియోని భాగ్యం ఫోన్ లో తీస్తుంది.

మరొకవైపు ప్రేమ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది. ఇంట్లో జరిగిన సంఘటనలు గుర్తుచేసుకొని ఎగ్జామ్ సరిగ్గా రాయదు. ధీరజ్ బయట వెయిటింగ్ చేస్తూ ప్రేమ ఎగ్జామ్ ఇరగదీస్తుందని అనుకుంటాడు. ప్రేమ బయటకు వస్తుంటే ఒకతను ప్రేమతో మాట్లాడుతుంటాడు. అప్పుడే ధీరజ్ అతడి దగ్గరికి వెళ్లి ఏంట్రా ఆ మాటలు.. పులిహోర కలుపుతున్నావా అని అడుగుతాడు. ఎవరండి మీరు అని అతను అడుగగా.. నా మొగుడు అని ప్రేమ అంటుంది. ఓహ్ అందుకేనా అంత పొస్సెసివ్ అని అతను అనగానే ప్రేమ నవ్వుతుంది. మరొకవైపు అమూల్య చేత విశ్వ పని చేపించాలని అనుకొని కాఫీ తీసుకొని రమ్మని చెప్తాడు. దాంతో అమూల్య కాఫీలో ఏదో కలుపుతుంది. విశ్వ ఆ కాఫీ తాగి వాష్ రూమ్ కి తిరుగుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.