Jayam serial : ముసుగులో ఉన్నది గంగ.. పెద్దసారు ప్లాన్ ఇదే!
on Nov 4, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -102 లో....రుద్ర ఎక్కడ గంగ ప్రేమలో పడతాడోనని శకుంతల ప్లాన్ ప్రకారం రుద్రకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడే రుద్ర వస్తాడు. రుద్ర ని పెళ్లి గురించి అడుగగా అతను సైలెంట్ గా ఉంటాడు. ఇప్పుడు పెళ్లి చెయ్యకపోతే ఏ పెదీంటి పిల్లనో ప్రేమిస్తావో.. మళ్ళీ నువ్వు బాధపడుతావోనని ఈ నిర్ణయం తీసుకున్నాను అని శకుంతల అనగానే నా జీవితంలో ప్రేమకి చోటు లేదని రుద్ర అంటాడు.
అమ్మ చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది కదా అని రుద్రతో ప్రీతి చెప్తుంది పెళ్లి చేసుకునేది వాడు వాడిష్టం ఉండాలని పెద్దసారు చెప్తాడు. అత్తయ్య ఏది ఏమైనా మంచి నిర్ణయం తీసుకున్నారని ఇషిక, వీరు అనుకుంటారు. అప్పుడే పెళ్లిళ్ల పేరయ్య కూడా వస్తాడు. అమ్మాయి ని తీసుకొని వచ్చానని చెప్తాడు. మేం వెళ్లి తీసుకొని వస్తామని ప్రీతీ, ప్రమీల, స్నేహ ముగ్గురు వెళ్లి అమ్మాయిని తీసుకొని వస్తారు.
అమ్మాయి ముసుగులో వస్తుంది తనని చూసి అమ్మాయి ఎంత సంప్రదాయం అయినా పిల్ల అని శకుంతల అనుకుంటుంది. ముసుగు తీసి చూసేసరికి గంగ ఉంటుంది. తనని చూసి అంతా షాక్ అవుతారు. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. నేనే తీసుకొని వచ్చానని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత గంగని పెళ్లి చేసుకోమని రుద్రకి పెద్దసారు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



