Bigg Boss 9 Telugu: తొమ్మిదో వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే!
on Nov 4, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిది వారాలు పూర్తయ్యాయి. ఇక తొమ్మిదవ వారం హౌస్ లో సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. మరి నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో ఓసారి చూసేద్దాం.
నిన్నటి ఎపిసోడ్ లో బొమ్మల టాస్క్ పెట్టాడు. అదే ఎవరైతే టెడ్డీని పట్టుకొని ఫాస్ట్‌గా సేఫ్ జోన్‌కి వెళ్తారో వాళ్లు సేఫ్. అవుతారు. ఎవరైతే టెడ్డీతో లాస్ట్ వరకూ గేటులోకి ఎంటర్ అవ్వకుండా ఉంటారో వాళ్లు నామినేషన్ జోన్‌లో ఉంటారు.. అలానే వాళ్ల చేతిలో ఉన్న టెడ్డీపై ఎవరి ఫొటో ఉంటుందో వాళ్లు కూడా నామినేషన్ జోన్‌లోకి వస్తారు. అప్పుడు ఆ ఇద్దరిలో ఎవరు వ్యాలిడ్ పాయింట్లతో ఫైట్ చేస్తే వాళ్లు సేఫ్ అయి ఇంకో పర్సన్ నామినేషన్స్‌లో ఉంటారు. ఇలా బజర్ మోగిన ప్రతిసారి ఒకరు నామినేట్ అవుతారు. ఈ నామినేషన్ ప్రక్రియలో సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, సాయి, తనూజ, రాము రాథోడ్ ఉన్నారు. వీళ్ళలో ఖచ్చితంగా తనుజ అయితే బయటకు వెళ్ళదు ఎందుకంటే తను అన్నపూర్ణ ప్రోడక్ట్ కాబట్టి.. అంతేకాకుండా ఆమెకు విపరీతంగా యాజమాన్యం సపోర్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి గేమ్ చూస్తే అర్థమవుతుంది కూడా అయితే ఈ ఆరుగురిలో ఎవరు బయటకు వెళ్లిపోతారు అని ఆశక్తి అందరికీ నెలకొంది. భరణి రీసెంట్ గానే మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి భరణి అంత త్వరగా బయటికి వెళ్లే అవకాశం లేదు. తర్వాత కొన్ని టాస్కులు పెడతారు కాబట్టి కచ్చితంగా సంజన దానిలో పెర్ఫార్మ్ చేయకపోవచ్చు. సంజన బయటికి వెళ్లిపోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి.
నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఇమ్మాన్యుయల్ తనూజను నామినేట్ చేశాడు. నామినేషన్ చేసిన వెంటనే తనుజ తనదైన శైలిలో సమాధానమిచ్చింది. తర్వాత ఇమ్మాన్యుయల్ కూడా కళ్యాణ్ , శ్రీనివాస్ సాయి దగ్గర ఎమోషనల్ అయిపోయాడు. నేను మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ వాళ్ల దగ్గర అన్నాడు. ఇమ్మాన్యుయల్ ఇన్ సెక్యూర్ గేమ్ ఆడుతున్నాడని తెలుస్తోంది. ఇంత జరిగిన తర్వాత ఇమ్మాన్యుయల్ తనలోని ప్లేయర్ని బయటకు తీస్తాడా లేక తనూజకి సపోర్ట్ గా ఆడతాడా తెలియాలంటే ఈ వారం అతని గేమ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



