మాస్టర్ ని పట్టుకుని విజ్జు అనేసిందేంటి జానులిరి
on Jul 14, 2025
.webp)
ఢీ 20 ఇది సర్ మా బ్రాండ్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. నెక్స్ట్ వీక్ విలేజ్ స్పెషల్ థీమ్ గా రాబోతోంది. ఈ ప్రోమోలో జానులిరి విజయ్ బిన్నీ మాష్టర్ ని పట్టుకుని పెద్ద మాటే అనేసింది. "ఈరోజు ఎట్లైతే అట్లా విజ్జుని నా వాడిని చేసుకోవాలి" అంటూ జాను ఇంకో డాన్సర్ కూడా విజయ్ బిన్నీ మాస్టర్ వైపు కొంటెగా చూస్తూ పెళ్లి కలలు కనేసారు. "వన్నెలాడి వన్నెలాడి" అంటూ ఆ సాంగ్ వచ్చింది. ఇక హోస్ట్ నందు ఐతే "మేము పిలవచ్చా విజ్జు అని లేదంటే వన్నెలాడి, టిక్కులాడే పిలవాలా" అని అడిగాడు. "నన్ను విజ్జు అని నా భార్యే ఇప్పటి వరకు పిలవలేదు" అని విజయ్ బిన్నీ మాస్టర్ ఇచ్చేసరికి నందు, జాను ఇద్దరూ తెగ నవ్వేసుకున్నారు.
తర్వాత విజయ్ మాస్టర్ స్టేజి మీదకు పిలిచాడు నందు. "రిఇంట్రడ్యూసింగ్ విజయ్ బిన్నీ యాజ్ లవర్ బాయ్ విజ్జు" అనేసరికి ఆయన కూడా షాకయ్యాడు. "సాంగ్ లిరిక్స్ కానీ దానికి వేసిన డాన్స్ కానీ చాలాచాలా బాగుంది. వాళ్ళు అలా అలా నవ్వుతుంటే" అంటూ జానుతో డాన్స్ చేశారు విజయ్ మాస్టర్ . తర్వాత ఆది వెళ్లి "ఇక నేను టీమ్ లీడర్ గా చేయడం లేదు జడ్జ్ గా చేస్తున్నాను" అన్నాడు. "ముందు డాన్స్ చేయదని తర్వాత జడ్జ్ అవ్వొచ్చు" అని కౌంటర్ వేసింది రెజీనా. "నువ్వు అంత హార్ష్ గా మాట్లాడకురా రా రెజీనా" అని ఆది అనేసరికి నవ్వేసింది. తర్వాత అనాలా సుస్మిత వచ్చి విజయ్ బిన్నీ మాస్టర్ కోసమే అన్నట్టు ఫిదాలో సాంగ్ కి డాన్స్ చేసింది. తర్వాత వెళ్లి ఆయన ఎదురుగా నిలబడింది. ఈ ప్రోమో విలేజ్ స్పెషల్ ప్రోమోనా లేదంటే విజయ్ బిన్నీ మాస్టర్ స్పెషల్ ప్రోమోనా అన్నట్టుగా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



