Brahmamudi : రేవతి దుగ్గిరాల కుటుంబంలోని ఆడబిడ్డ.. స్వరాజ్ కి ఐస్ క్రీమ్ కొనిచ్చిన అపర్ణ!
on Jul 15, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -773 లో..... రౌడీలు అప్పుని కేసులో ఇరికించడానికి ఎలా ట్రై చేసారో స్క్రిప్ట్ చేద్దామని రాజ్ అంటాడు. అందులో భాగంగా రాహుల్, రుద్రాణిలకి చెరొక క్యారెక్టర్ ఇస్తారు. ఏ క్యారెక్టర్ ఇచ్చిన కూడా రాహుల్, రుద్రాణిలని కుటుంబం మొత్తం ఎదో ఒక రీజన్ తో కొడుతుంటారు. ఆ తర్వాత రాజ్, కావ్యలకి రౌడీల అడ్రెస్ తెలుస్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోవాలని రాజ్, కావ్య వెళ్తారు.
రాజ్, కావ్య రౌడీలని పట్టుకోవడానికి వెళ్తున్న విషయం యామినికి ఫోన్ చేసి చెప్తుంది రుద్రాణి. నువ్వు ఏదో పెద్ద ప్లాన్ చేసావనుకున్న చీప్ గా ఇలా చేశావేంటని యామినిపై రుద్రాణి కోప్పడుతుంది. మరొకవైపు ఇందిరాదేవి ఎవరి కంట పడకుండా బయటకి వెళ్లాలనుకుంటుంది. స్వప్న ఎదరుపడి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. అప్పుడే అపర్ణ వస్తుంది. ఎవరి కంట్లో పడకూడదనుకున్నానో వాళ్ల కంట్లోనే పడ్డాన అని ఇందిరాదేవి కంగారు పడుతుంది. ఏదో ఒకటి చెప్పి ఇందిరాదేవి అక్కడ నుండి వెళ్తుంది. మరొక వైపు రాజ్, కావ్య వెళ్తుంటే అప్పుని కేసు లో ఇరికించిన రౌడీ వాళ్ల కార్ కి డాష్ ఇస్తాడు. దాంతో రాజ్ కి అతనికి గొడవ జరుగుతుంది. మనకి టైం అవుతుందంటూ రాజ్ ని కావ్య అక్కడ నుండి తీసుకొని వెళ్తుంది.
ఆ తర్వాత ఇందిరాదేవి రేవతి దగ్గరికి వస్తుంది. నానమ్మ అంటు ఇందిరాదేవిని హగ్ చేసుకుంటుంది రేవతి. మీ అమ్మ మనసు మారడం లేదు.. నువ్వు మోసం చేసావన్న దాంట్లో నుండి బయకి రావడం లేదని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగం లో అపర్ణ కార్ డోర్ తీస్తుంటే రేవతి కొడుకుకి తాకుతుంది. నా ఐస్ క్రీమ్ కింద పడింది.. కొనివ్వమని ఆ బాబూ అంటాడు. నీ పేరు ఏంటని అపర్ణ అనగానే స్వరాజ్ అని బాబు చెప్తాడు. అపర్ణ దగ్గరికి తీసుకొని ఐస్ క్రీమ్ కొనిస్తుంది. మరొకవైపు రేవతి, ఇందిరాదేవి మాట్లాడుకుంటుండగా అప్పుడే కావ్య, రాజ్ వచ్చి డోర్ కొడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



