Illu illalu pillalu : సేనాపతిని పట్టించిన ఆ క్లూ.. నర్మద మాస్ వార్నింగ్!
on Nov 11, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -313 లో..... నర్మద ఏ తప్పు చెయ్యలేదని అసలు నేరస్తులు వేరే ఉన్నారని.. వాళ్ళని కనిపెట్టే పనిలో అధికారులు ఉన్నారని న్యూస్ లో వస్తుంది. అది చూసి వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు ఆ న్యూస్ చూసి భద్రవతి, సేనాపతి టెన్షన్ పడుతారు. ఆ కుట్ర వెనకాల మనం ఉన్నామని తెలిసి ఉంటుందా అని సేనాపతి భయపడుతాడు.
కాసేపటికి సేనాపతి దగ్గరికి పోలీసులు వస్తారు. అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే అప్పుడే నర్మద వస్తుంది. ఏంటి సర్ వీళ్ళకి మీరే కుట్ర చేసినట్లు ఎలా తెలిసిందని అనుకుంటున్నారా అని నర్మద అంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఒక క్లూ మాత్రం వదిలేసారు.. మీరు అతనికి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసిన స్టేట్ మెంట్ సంపాదించానని నర్మద అంటుంది. నా బ్యాంకు డీటెయిల్స్ ఎలా వచ్చాయని సేనాపతి అనగానే ప్రేమ మొన్న రాత్రి ధీరజ్ పై కోపంగా వెళ్లి వాళ్ళ నాన్న ఫోన్ నుండి డీటెయిల్స్ తీసుకుంటుంది.. అది విని సేనాపతి షాక్ అవుతాడు. ఏం బ్రతుకులురా మీవి తప్పు సరిదిద్దుకోవాలి గానీ ఇలా చేస్తారా.. అక్కడ ఉంది నా కోడలు అని సేనాపతిపై రామరాజు కోప్పడతాడు.
నాన్న మంచి బహుమతి ఇచ్చావ్ అని ప్రేమతో సేనాపతి అంటాడు. ఆ తర్వాత సేనాపతిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఏమో అన్నారు పిన్ని గారు అని భాగ్యం వాళ్ళకి నర్మద వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నర్మద జాబ్ పోగొట్టాలని నువ్వు వాళ్ళతో అన్నావ్.. ఆ విషయం గనుక తెలిస్తే మన పరిస్థితి ఏంటని వాళ్ళ అమ్మతో చెప్తూ శ్రీవల్లి భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



