Karthika Deepam2 : భర్త కోసం సీఈఓ పదవిని వద్దనుకున్న దీప.. పారిజాతం షాక్!
on Nov 11, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -512 లో.. దీప సీఈఓ అన్న ఆలోచనని శివన్నారాయణకి కలిగేలా చేస్తుంది జ్యోత్స్న. నా భార్యని సీఈఓగా ప్రపోజ్ చేస్తున్నాను.. మీ ఒపీనియన్ చెప్పండి అని కార్తీక్ బోర్డు మెంబర్స్ తో చెప్తాడు. నేను సీఈఓ ఏంటని దీప అక్కడ నుండి బయటకు వెళ్తుంది. నా కోసం నువ్వు ఈ నిర్ణయం ఒప్పుకోవాల్సిందేనని అనడంతో దీప మళ్ళీ లోపలికి వస్తుంది. అసలు సీఈఓగా తనకి ఏం అర్హత ఉందని జ్యోత్స్న అడుగుతుంది.
నువ్వు అర్హత ఉండి ఏం సాధించావని జ్యోత్స్నని కార్తీక్ అడుగుతాడు. నా భార్య అర్హత గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు చెప్పి తీరాలని దీప గురించి కార్తీక్ చెప్తాడు. తను వాళ్ళ నాన్నకి వంటలో సహాయం చేసేది.. అప్పుడే మంచి వంటలు నేర్చుకుంది అంతే కాకుండా నేను సత్య రాజ్ రెస్టారెంట్ తీసుకున్నప్పుడు తనే ఆ సంస్థ ముందుకి రావడానికి హెల్ప్ చేసింది.. కొత్త వంటకాలు పరిచయం చేస్తూ సంస్థ అభివృద్ధిలో తను భాగం అయిందని దీప గురించి కార్తీక్ గొప్పగా చెప్తాడు. ఇప్పుడు ఓటింగ్ పెడుదాం.. ఎవరికి ఎక్కువ ఓట్స్ పడితే వాళ్లే సీఈఓ.. ఇందులో ఓన్లీ బోర్డు మెంబర్స్ మాత్రమే పాల్గొన్నాలని శివన్నారాయణ చెప్తాడు. అందరు దీపకి ఓట్లు వేస్తారు.. దాంతో కొత్త సీఈఓ దీప అని శివన్నారాయణ చెప్తాడు.
అందరికి థాంక్స్.. నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు అని దీప చెప్తుంటే పారిజాతం లేచి దీపని కత్తితో పొడవడానికి వెళ్తుంటే.. నాకు ఈ పదవి ఇష్టం లేదని దీప అంటుంది. దాంతో పారిజాతం ఆగిపోయి ఇదెక్కడి ట్విస్ట్ అని అనుకుటుంది. నాకు ఏం అర్హత ఉందని ఈ బాధ్యత ఇచ్చారు.. నా స్థానం అది అయితే నా భర్త స్థానం ఏంటని దీప అడుగుతుంది. ఇంకేంటి డ్రైవర్ అని జ్యోత్స్న అంటుంది. నాకన్నా తక్కువ స్థాయిలో నా భర్త ఉండడం నాకు ఇష్టం లేదు.. దయచేసి నన్ను క్షమించండి అని దీప అందరికి చెప్తుంది. మరి ఇప్పుడు కొత్త సీఈఓ ఎవరు అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే మెట్లు ఎక్కుతు ఎవరో ఎంట్రీ ఇస్తారు. వాళ్ళ ఫేస్ రీవీల్ చెయ్యలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



