దశావతారాల్లో బుల్లితెర కమల్ హాసన్
on Sep 29, 2022

స్కిట్స్ కి తగ్గట్టు రకరకాల గెటప్స్ తో వచ్చి ఆ స్కిట్ కి న్యాయం చేయడం అనేది ఒక్క శీనూకే చెల్లుతుంది. అందుకే గెటప్ శీను అనే పేరు సరిగ్గా సరిపోయింది. శీను ఎలాంటి గెటప్ తో వచ్చి ఎంటర్టైన్ చేస్తాడా అని ఆడియన్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు దసరా వైభవం స్పెషల్ ఈవెంట్ లో అద్భుతమైన గెటప్స్ తో మెరిశాడు శీను. ఇలాంటి గెటప్స్ వేయడం అనేది బిగ్ స్క్రీన్ మీద కమలహాసన్ కి బుల్లి తెర మీద శీనుకే చెల్లిందని చెప్పొచ్చు. అందుకే అందరూ శీనుని బుల్లితెర కమలహాసన్ అని పిలుచుకుంటారు.
ఈటీవీలో అక్టోబర్ 5 న ప్రసారం కాబోయే దసరా వైభవం ఈవెంట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో గెటప్ శీను దశావతారాల గెటప్ లో కనిపించి ఎంటర్టైన్ చేసాడు. బామ్మ గెటప్ లో ఉన్న శీనుని రాంప్రసాద్ "బామ్మ నీ యాక్షన్ సూపర్, చాలాబాగా చేస్తున్నావ్ " అనేసరికి "థ్యాంక్యూ నాన్న " అంటుంది. "కమల్ హాసన్ గారు కూడా బాగా చేశారు" అనేసరికి "ఏమిటి" అని వినిపించినట్టు, అర్ధం కానట్టు అడుగుతుంది బామ్మ "ఏమిటి కమలహాసన్ గారి నటనను కూడా ఒప్పుకోవా" అంటూ హైపర్ ఆది పంచ్ డైలాగ్ వేసేసరికి అందరూ నవ్వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



