ఈమె నా భూమి తల్లి.. నా చిన్ని ప్రాణం!
on Sep 29, 2022

'సాహసం చేయరా డింభకా' షోకి యాంకర్ ఎవరు అని అడిగితే చాలు ఇప్పటికీ ఉదయభాను పేరును గుర్తుచేసుకుంటారు చాలా మంది. ఉదయభాను బుల్లితెర మీద ఒకప్పటి గ్లామరస్ యాంకర్. ఇప్పుడు ప్రతీ షోలో శ్రీముఖి, అనసూయ ఎలా కనిపిస్తున్నారో.. అప్పట్లో అంటే దాదాపు ఒక 20 ఏళ్ళ క్రితం ఉదయభాను, ఝాన్సీ అలా అన్ని షోస్ ని హోస్ట్ చేసేవారు.
తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు పెళ్లి, పిల్లలతో బిజీ ఇపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా సోషల్ మీడియాని బాగా యూజ్ చేస్తున్నారు. ఉదయభాను మంచి డాన్సర్ కూడా కావడంతో కొన్ని మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ప్రేమ వివాహం చేసుకుని లైఫ్ లో సెటిల్ ఐపోయి కొన్నాళ్ల పాటు యాంకరింగ్ ని పక్కన బెట్టింది. ఈమెకు ట్విన్ డాటర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కాస్త పెద్దవాళ్లయ్యేసరికి ఉదయభాను మళ్ళీ యాంకరింగ్ మీద దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది ఉదయభాను.
తన కూతురితో తీసుకున్న ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది. "ఈమె నా భూమి తల్లి.. నా చిన్ని ప్రాణం.. నేను ఉదయం పూట టీ చేసుకునేటప్పుడు అందులో భూమి తల్లి చక్కగా నవ్వుతూ నా టీని అమృతంలా మార్చేస్తుంది" అంటూ ట్యాగ్‌లైన్ పెట్టింది. ఇలా కూతురిని ముద్దాడుతూ మురిసిపోయింది. ఇక నెటిజన్స్ కూడా టు బ్యూటీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



