నాకు రష్మిక మందనా లాంటి వైఫ్ కావాలి
on Aug 7, 2025
.webp)
శ్రావణ మాసం సందర్భంగా ఇప్పుడు షోస్ అన్నిట్లో ఆ శ్రావణ మాసం ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ వీక్ ఫామిలీ స్టార్స్ కూడా అదే థీమ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇందులో రోహిణి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇక కమెడియన్ జ్ఞానేశ్వర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "జ్ఞాని ఏంట్రా" అని సుధీర్ అడిగేసరికి "అన్న నేను కూడా పూజ చేయడానికి వచ్చాను. పూజ చేస్తే నాకు కూడా రష్మిక మందనా లాంటి వైఫ్ కావాలి" అన్నాడు. "రేయ్ ఆవిడ యానిమల్ ని థియేటర్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. పర్సనల్ గా నేను ట్రై చేశా యాక్సెప్ట్ చేయరు." అన్నాడు సుధీర్ . ఇంతలో శ్రీకర్ కృష్ణ ముందుకు వచ్చి "ఈ పూజ సంగతి పక్కన పెట్టు రీసెంట్ గా ఎవరో పూజ పరిచయం అయ్యారటగా" అన్నాడు కామెడీగా. "ఏంటయ్యా బాబు నువ్వు" అన్నాడు సుధీర్.
తర్వాత సుధీర్ అమ్మాయిల ముందు తెగ సిగ్గుపడ్డాడు. "అందంగా లేను అని అందరూ నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు" అన్నాడు కావ్య ముందుకు వెళ్లి. "దేవుడు ఎవరినీ అందం లేకుండా స్రుష్టించడు అండి. కానీ మిమ్మల్ని ఎవరు సృష్టించారో తెలీట్లేదు" అంది. అంతే సుధీర్ షాకయ్యాడు ఆ కామెంట్ కి. ఇక రోహిణి ఐతే వైరల్ వయ్యారి పాటలో ఆ వయ్యారిని నేనే అంటూ నా వెనకాల పడుతున్నారు అంటూ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇంకా ఆ పాటకు రోహిణి డాన్స్ చేసి సుధీర్ ని ఒక ఆట ఆడేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



