నాంచాక్ తిప్పి అందరినీ పిచ్చెక్కించిన ఆలీ...
on Aug 7, 2025

కూకు విత్ జాతిరత్నాలు షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో వెరైటీ గా ప్రొఫెషన్ థీమ్ పేరుతో ఎపిసోడ్ ని తీసుకురాబోతున్నారు. ఇక అవినాష్ ఐతే నర్స్ డ్రెస్ వేసుకొచ్చి తన పేరు సిరంజి అంటూ చెప్పి కొంచెం ఫన్ క్రియేట్ చేసాడు. తర్వాత విష్ణు ప్రియా వచ్చి "నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్ ఉంది" అని చెప్పింది. "కొంచెం కాదు చాలా ఉంది" అంటూ చెప్పాడు అవినాష్. ఇక సైంటిస్ట్ ప్రొఫషన్ లో రీసెర్చ్ చేస్తూ కనిపించాడు బిత్తిరి సత్తి. "కుక్క కాటుకు చెంప దెబ్బ అంటారు కదా ఆ చెప్పు ఎన్నో నంబర్ సైజు అనే దాని మీద రీసెర్చ్ చేసి 8 వ నంబర్ సైజు చెప్పుతో కొట్టారు అది నేను కనిపెట్టాను" అంటూ క్రియేటివ్ గా చెప్పాడు.
దానికి రాధ పగలబడి నవ్వింది. ఇక సుహాసిని ఐతే కరాటే మాష్టర్ వేసుకునే వైట్ డ్రెస్ లో వచ్చింది. నాంచాక్ తీసుకుని ఆలీ దగ్గరకు వెళ్లి "నన్ను గుర్తుపట్టలేదా మల్లి" అని అడిగింది. "అది నాకు చేతికి ఇవ్వకు నాకేదో లోపల వచ్చేస్తూ ఉంటుంది" అని చెప్పి పైన కోట్ తీసి వేరే లెవెల్ లో నాంచాక్ తిప్పేసరికి అందరూ షాకయ్యారు. ఓ మై గాడ్ అంటూ సంజయ్ తుమ్మ గట్టిగా అరిచాడు. ఐతే లాస్ట్ వీక్ నుంచి జడ్జ్ ఆశిష్ విద్యార్థి కనిపించడం లేదు. ఆయన ప్లేస్ లో ఆలి వస్తున్నారు. ఇక నెటిజన్స్ ఐతే ఆశిష్ విద్యార్థి గారు కావాలి. ఆయన ప్లేస్ ని ఆలీతో రీప్లేస్ చేసినట్టు ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



