ఇది కుకింగ్ షోనా.. పచ్చబొట్ల షోనా... నాకింకా పెళ్లి కాలేదు తల్లో....
on Mar 15, 2025
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా సాగింది. ఇందులో దీపికా ఎపిసోడ్ ఐతే మాములుగా లేదు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే.. అలా ఉంది. అది కూడా జడ్జ్ జీవన్ తో చేసిన అల్లరికి స్టేజి మొత్తం షేకయ్యింది. దీపికా షోలోకి వస్తూనే జీవన్ ని చూస్తూ సిగ్గుపడుతూ వచ్చింది. ఆ సిగ్గుపడే విషయాన్ని సుమ చెవిలో చెప్పేసింది. సుమ ఐతే జీవన్ కి కంగ్రాట్స్ కూడా చెప్పేసింది. దాంతో అసలు ఏం జరిగిందో తెలీక షాకయ్యాడు జీవన్. (Deepika Rangaraju)
అసలు ఇది నిజంగా పచ్చబొట్టేనా అని దీపికా చేయి పట్టుకుని అడిగింది సుమా. "జీవన్ గారు నాకు మంచి మార్కులు ఇవ్వాలని నేను ఇలా పచ్చబొట్టు వేసుకుని వచ్చా." అని చెప్పింది. "ఇదేంటి ఇది కుకింగ్ షో అన్నారు...ఏంటి ఈ పచ్చబొట్లు అంటున్నావు...నీకు దణ్ణం తల్లి..పెళ్లి కానీ వాడిని పట్టుకుని ఇలా నీ చేతుల మీద పేర్లు వేయించుకుంటే ఇక పెళ్లి కూడా కాదు నాకు" అని జీవన్ తెగ ఫీలైపోయాడు. ఇక విష్ణుప్రియ ఐతే ఇంకో గట్టి కౌంటర్ ఇచ్చింది. "ఇంకా పెళ్లి అవుతుంది అనుకుంటున్నారా ?" అని అడిగింది. ఆ మాటకు గుండెను గట్టిగా పట్టుకుని తెగ బాధపడ్డాడు జీవన్. "ఐపోయింది ఇక ఇదంతా బిస్కెట్ యాపరమే ఇదంతా..నీకో దణ్ణం తల్లి" అనేసి వెళ్ళిపోయాడు. "బ్యాచిలర్ గా ఉన్నప్పుడే కాదు మూడు నాలుగు పెళ్ళిళ్ళైనా వదలను...మార్కుల కోసం" అంటూ తన కుకింగ్ కి మార్కులు ఇవ్వకపోతే ఇక అంతే అన్న రేంజ్ లో దీపికా వార్నింగ్ ఇచ్చింది.
జీవన్ కరోనా సమయంలో ఎంతోమందికి ఉచితంగా భోజనం అందించాడు. ఇక జీవన్ ఫలక్‌నుమాదాస్, ఈ నగరానికి ఏమైంది, సవారి, జాతిరత్నాలు, ఏక్ మినీ కథ, పుష్ప, విరాటపర్వం, కీడా కోలా వంటి మూవీస్ లో రకరకాల రోల్స్ లో కనిపించి ఎంటర్టైన్ చేసాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
