Bigg Boss 9 Telugu : బీబీరాజ్యంలోని ప్రజలను ఆడుకున్న రాజు, రాణులు!
on Nov 13, 2025
.webp)
బిగ్ బాస్ హౌస్ లో బీబీ రాజ్యం అనే టాస్క్ నడుస్తుంది. కళ్యాణ్ రాజు దివ్య, రీతూ ఇద్దరు రాణీలు అయితే వీళ్ళకి నలుగురు కామండర్స్, నలుగురు ప్రజలు ఉంటారు. రాజు, రాణి కలిసి ప్రజలని ఒక అట ఆడేసుకుంటారు. నాకు అది తినాలనిపిస్తుంది.. ఇది తినాలనిపిస్తుందంటూ ముగ్గురు ప్రజలని టార్చర్ పెడతారు.
సుమన్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. నువ్వు చిరునవ్వు నవ్వుతూ.. మెగాస్టార్ వీణ స్టెప్ చెయ్యమని సుమన్ కి రీతూ చెప్తుంది. సుమన్ బాగా చేస్తాడు. చిరునవ్వు అన్న ప్రతీసారి ఇలా చెయ్యాలని చెప్తారు. ఆ తర్వాత భరణిని పిలుస్తారు. మీరు చిరునవ్వు అన్నప్పుడు అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే స్టెప్ వెయ్యాలని భరణికి దివ్య చెప్తుంది. దాంతో భరణి డాన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ ని పిలిచి ఈ పేటకి నేనే మేస్త్రి అనే సాంగ్ కి సిగ్నేచర్ స్టెప్ చెయ్యమని రీతూ వాళ్ళు ఆర్డర్ వేస్తారు. దాంతో ఇమ్మాన్యుయల్
ఆ స్టెప్ వేస్తాడు. ఆ తర్వాత ప్రజా సుమన్ మాకు తాగడానికి షుగర్ లెమన్ వాటర్ తీసుకొని రండి అని రీతూ ఆర్డర్ వేస్తుంది. ఇక భరణి టాస్క్ స్టార్ట్ కాకముందు దివ్యని ఏదో అన్నాడని రాణిగా తన చేతులు కట్టివేయిస్తుంది.
ఆ తర్వాత వాటర్ మిలన్ నాకూ తినిపించమని సుమన్ కి రీతూ ఆర్డర్ వేస్తుంది. తినకపోతే బుజ్జగించి తినిపించాలని రీతూ చెప్తుంది. సుమన్ తినిపిస్తుంటే రీతూ ఒక దగ్గర ఉండకుండా టేబుల్ ఎక్కుతుంది. దాంతో సుమన్ కూడా టేబుల్ ఎక్కి తినిపిస్తాడు. అలా రీతూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి తినిపిస్తాడు. ఈ విధంగా రాణీలు ఇద్దరు ప్రజలతో పనులు చేయించి రాక్షసానందం పొందారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



