Bigg Boss 9 Telugu : టాస్క్ లో గెలిచింది, ఇమ్మ్యూనిటీ పొందింది ఎవరంటే!
on Nov 13, 2025
.webp)
బిగ్ బాస్ హౌస్ లో బీబీ రాజ్యం టాస్క్ సాగుతోంది. ఇందులో ఇమ్మ్యూనిటి గురించి టాస్క్ లు జరుగుతున్నాయి. రాజు, రాణులు ముగ్గురు కలిసి కమాండర్ నుండి ఇద్దరిని సెలక్ట్ చేసుకొని ఇమ్మ్యూనిటీకీ దగ్గరగా వెళ్లే ఛాన్స్ ఇవ్వండి అని రాజు, రాణులకి బిగ్ బాస్ చెప్తాడు. వాళ్ళు డిసైడ్ చేసుకొని నిఖిల్, డిమాన్ కి ఛాన్స్ ఇస్తారు. వాళ్ళు ప్రజలనుండి ఇద్దరిని సెలక్ట్ చేసుకోవాలి. ఆ టాస్క్ లో ప్రజలు గెలిస్తే వాళ్ళకి కమాండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
దానికి నిఖిల్, డీమాన్ కలిసి గౌరవ్, భరణిని సెలక్ట్ చేసుకుంటారు. ఆ టాస్క్ లో నిఖిల్, డిమాన్ గెలిచి వాళ్ళ స్థానాన్ని పదిలం చేసుకుంటారు. ప్రజలు అయిన గౌరవ్, భరణి ఇమ్మ్యూనిటీ కోల్పోతారు. ఆ తర్వాత టాస్క్ అనంతరం భరణి సర్ వళ్లే నా ఇమ్మ్యూనిటి పోయింది. టాస్క్ లో సర్ రోప్ నుండి మెల్లిగా వెళ్లొచ్చు కేర్ లేస్ గా ఉన్నాడని గౌరవ్ బాధపడుతూ కెమెరాకి వచ్చి చెప్తాడు. ఆ తర్వాత రాజు, రాణులు ముగ్గురిలో ఒక్కరు తమ స్థానం పదిలం చేసుకోవడానికి టాస్క్ ఆడాలని బిగ్ బాస్ చెప్తాడు. రాణులలో నుండి దివ్య వస్తుంది. కమాండర్ నుండి నిఖిల్ వస్తాడు.
ఈ టాస్క్ లో నిఖిల్ గెలుస్తాడు. దివ్య రాణి స్థానం పోయి.. నిఖిల్ కి రాజు స్థానం వస్తుంది. దివ్యకి కామండర్ స్థానం వస్తుంది. హౌస్ లో ఇప్పటికే గౌరవ్, భరణి ఇద్దరు ఈ వీక్ ఇమ్మ్యూనిటి పొందే ఛాన్స్ మిస్ అయ్యారు. ఎవరు ఈ వీక్ కెప్టెన్ అయి ఇమ్మ్యూనిటి పొందుతారో తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



