అదిరిపోతున్న బిగ్ బాస్ హౌస్
on Sep 1, 2022

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 సెప్టెంబర్ 4 న సాయంత్రం 6 గంటలకు మొదలుకావడానికి సిద్దమయ్యింది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో బిగ్ బాస్ హౌస్ ని లోపల లొకేషన్ ని చూపించారు. ఈ హౌస్ లోకి మెరీనా-రోహిత్ సాహ్ని జోడి, జబర్దస్త్ ఫేమ్ ఫైమా, తన్మయ్ రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మెరీనా-రోహిత్ సాహ్ని జోడి పై ప్రోమో షూట్ జరిగిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలాగే హోస్ట్ నాగార్జున శుక్ర, శని వారాల్లో షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
ఇక ఈ సీజన్లో సామాన్యులని కూడా హౌస్ లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. మొదటి ఫైవ్ సీజన్స్ కంటే కూడా ఈ సీజన్ అదిరిపోతోంది అనే టాక్ వినిపిస్తోంది. అ అంటే అమలాపురం అనే ఐటం సాంగ్‌తో పాపులరైన అభినయ శ్రీ ఈసారి హౌస్‌లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. తర్వాత జబర్దస్త్ నుంచి చలాకీ చంటి, నటుడు శ్రీహాన్, సింగర్ రేవంత్, నటుడు బాలాదిత్య, గలాటా గీతూ వంటి వాళ్ళు ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్, వారి పెర్ఫార్మెన్సెస్ తో కొన్ని విజువల్స్ ని ప్రోమోలో చూపించారు. ఆదివారం చాలా గ్రాండ్ గా ఈ షో స్టార్ట్ కాబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



