పనికిమాలినోడ అంటూ రాంప్రసాద్ పరువు తీసేసిన అన్నపూర్ణ
on Sep 1, 2022
.webp)
వినాయక చవితి పండగ రోజున అన్నీ ఫన్ ఓరియెంటెడ్ కార్యక్రమాలతో బుల్లి తెర మెరిసిపోయింది. ఈటీవీలో "మన ఊరి దేవుడు" పేరుతో వచ్చిన ప్రోగ్రాం చాలా బాగా హైలైట్ అయ్యింది. ఇందులో అన్నపూర్ణమ్మ ఒక టీమ్ తరపున వస్తుంది. "పండగకు ఏం స్పెషల్స్ చేస్తున్నారేమిటి" అంటూ ప్రదీప్ అన్నపూర్ణను అడుగుతాడు. "నేను మాత్రం పాయసం చేస్తాను అంటుంది. ఇంతలో మరో టీమ్ నుంచి ఆటో రాంప్రసాద్ వచ్చి ఆయాసం వచ్చే వయసులో పాయసం చేయడమెందుకు రెస్ట్ తీసుకోక" అంటాడు. "ఒరేయ్ పనికిమాలినోడా ఇంతా ఆయాసంతోనే ఐదారు స్కిట్లు చేయించుకున్నాడు ఒక సిగ్గులేనోడు" అంటూ కౌంటర్ డైలాగ్ వేస్తుంది.
"ఇక ఏమీ తెలియనట్టు ఎవడు అని రాంప్రసాద్ అనేసరికి ఎవడో" అంటుంది అన్నపూర్ణ. "నేనైతే కుడుములు చేస్తా" అని మలక్ పేట శైలజ అనేసరికి "ఈ ఉడుము మొహమేసుకుని కుడుములు చేస్తే మా టీమ్ లో గణపతి మాస్టారు కూడా తినడు" అని ఆది పంచ్ వేసేసరికి పళ్ళు నూరుతుంది శైలజ. ఇక తర్వాత నాటి నరేష్ వచ్చి ఖుష్బూను పొగుడుతాడు. "ప్రపంచంలో అందమైన రెండు ఒకటి మీరు రెండు నేను" అని బుగ్గ గిల్లేసరికి గట్టిగా నరేష్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. "వాడు వేసుకున్న షర్ట్ కలర్ మొత్తం పోయే వరకు మీ అన్నయ్యలతో బాగా ఉతింకించమ్మా" అంటూ అన్నపూర్ణమ్మ అంటుంది. ఆ డైలాగ్ కి అందరూ నవ్వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



