చలాకి చంటి రెమ్యూనరేషన్ ఎంత!
on Oct 15, 2022

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన చంటి గుర్తున్నాడా. చలాకి చంటి రెండు తెలుగు రాష్టాలలో ఈ పేరు తెలియని వారు ఉండరు. జబర్దస్త్ లో ఒక ఆట ఆడుకున్న చంటి అందరికీ సుపరిచితమే. చంటి పూర్తి పేరు వినయ్ మోహన్. ఇతను 1986 జూన్ 29 న హైదరాబాద్ లో జన్మించాడు. చిన్నప్పుడే తల్లి చనిపోతే, తన అమ్మమ్మ మామయ్య ల దగ్గర పెరిగాడంట. డిగ్రీ చదువుతున్నప్పుడు ఆర్థికపరిస్థితి బాగోలేక చదువు మానేసి, ఒక చిన్న కంపెనీలో కస్టమర్ ఎక్జిక్యూటివ్ గా పని చేసాడట. ఆ తర్వాత ఒక గెస్ట్ హౌస్ మేనేజర్ గా చేసాడు. ఇంకా రేడియో జాకిగా కూడా చేసాడంట. రేడియో జాకిగా ఉన్నపుడే చలాకీ చంటి అనే పేరు వచ్చిందట. తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ గా చేయగా, చంటి-బంటి ప్రోగామ్ తో మంచి గుర్తింపు వచ్చిందట. రచయితగా మరియు 2009 లో వచ్చిన జల్లు సినిమాలో నటించాడు. ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టులో నటించాడు.
దాదాపు పదహారు సినిమాలలో అవకాశం వచ్చి దూరం అయ్యాయట. సినిమా అవకాశాలు రాలేక,చాలా కష్టాలు అనుభవించాడట. యూట్యూబ్ లో కామెడీ స్క్రిప్ట్ తో మళ్ళీ తన సత్తా చాటడం వల్లే, అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయట. 2013 లో జబర్దస్త్ వాళ్ళు చంటికి అవకాశం ఇచ్చారు. అప్పటి నుండి తన సక్సెస్ స్టార్ట్ అయ్యిందట. ఫేమ్ అంతా జబర్దస్త్ వల్లనే వచ్చిందని చెబుతుంటాడు చంటి. 'నా షో నా ఇష్టం' షో కి హోస్ట్ గా కూడా చేసాడు. 2016 లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. చంటి కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంటి దాదాపు యాభై నుండి అరవై సినిమాల వరకు నటించాడట.
బిగ్ బాస్ లో 5వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన చంటి, హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని ప్రేక్షకులు ఆశించినా, హౌస్ లో అంతగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయాడు. అటు ఎంటర్టైన్మెంట్ లేక, ఇటు గేమ్ లో కూడా సరిగ్గా పర్ఫామెన్స్ లేకపోవడంతో వరెస్ట్ పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్నాడు. నాగార్జున తన ఆటతీరు మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా, ఆటలో అంతగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. హౌస్ లో ఎలాంటి కామెడిని పండించలేకపోయాడు. ప్రతీవారం నామినేషన్ లో ఉన్నప్పటికీ, అభిమానులు సేవ్ చేస్తూ వస్తోన్నారు. కానీ అయిదవ వారం సేవ్ చెయ్యలేకపోవడంతో,ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్నాడు. చంటి హౌస్ మేట్స్ తో నాకు హౌస్ లో ఉండాలని లేదు, బయటికి వెళ్లాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చిన కూడా, దానిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. కాగా ఓటింగ్ లో చివరి స్థానంలో ఉండడంతో అయిదవ వారం ఎలిమినేట్ అయి బయటకొచ్చేసాడు. ఆ తర్వాత బయటికొచ్చాక కూడా హౌస్ మేట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.
చంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "లోపల ఎవరి గేమ్ వారు ఆడుతున్నారు, ఎక్కువగా ఫేక్ రిలేషన్స్ ఉన్నాయి. టాస్క్ లో బాగా పర్ఫామెన్స్ చేయకపోతే ఎవరైనా బయటకొచ్చేయాల్సిందే" అని చెప్పాడు. తర్వాత రెమ్యూనరేషన్ గురించి అడుగగా, "అవన్నీ చెప్పకూడదు, చెప్పను" అని మాట దాటేసాడు. అయితే చంటికి అయిదు వారాలకి రెమ్మునెరేషన్ రోజుకి నలభై నుండి నలభై వేల వరకు తీసుకోవచ్చని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



