'పిల్లల్ని పెంచడంలో మహిళలకు వంద గోల్డ్ మెడల్స్ ఇచ్చేయొచ్చు'
on Oct 15, 2022

ఒక్క తల్లి వంద మంది పిల్లల్ని చూసుకోగలుగుతుంది కానీ వంద మంది పిల్లలు ఒక తల్లిని చూసుకోలేరు అనేది నానుడి. ఐతే ఇలాంటి విషయం గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ పిల్లల్ని పెంచడంలో మహిళలకు వంద గోల్డ్ మెడల్స్ ఇచ్చేయొచ్చు అని ఒక అద్భుతమైన కామెంట్ చేశారు. ఒక రిలేషన్ షిప్ లో 99 మార్కులు ఆడవాళ్ళకు 1 మార్కు మగవాళ్లకు వెయ్యాలి.
ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెపుదామనుకుంటున్న కానీ అవకాశం రాలేదు అంటూ మిస్టర్ అండ్ మిస్సెస్ వేదికపై తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇక ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర భార్యాభర్తలు వచ్చి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి ఎంటర్టైన్ చేశారు. ఇక శ్రీవాణి- విక్రమ్ చేసిన డాన్స్ కి అందరూ ఫుల్ కుష్ అయ్యారు. ఐతే విక్రమ్ మేడలో వేసుకున్న హారం చూసిన రాకేష్ "శ్రీకృష్ణదేవరాయలు వేసుకున్న హారమా ఏంటి" అని అడిగేసరికి అనిల్ రావిపూడి "ఏంటి రాకేష్... చేతికి వేసుకున్న ఉంగరాలు , గొలుసులు, హారాలు అవీ చూస్తావా నువ్వు " అని అడిగారు. "వయసు అలాంటి కదా సర్" అని రాకేష్ ఆన్సర్ ఇచ్చేసరికి "వయసులో ఎవరైనా ఆడవాళ్లను చూస్తారు ..నువ్వెంటి మగవాళ్ళను చూస్తావా" అంటూ శ్రీముఖి కౌంటర్ వేసింది.
తర్వాత రాకేష్ స్నేహకి ఆపిల్ పీసెస్ తినిపిస్తాడు. కానీ అనిల్ మాత్రం తనకు తినిపించొద్దు అని చెప్పేసరికి శివ బాలాజీ తినిపించబోతాడు రాకేష్ .."నువ్ నా దగ్గర హార్ట్ ఫుల్ గా మాట్లాడితే మాట్లాడు లేదంటే వెళ్ళిపో" అనేసరికి "అన్నయ్యా ఎన్నో రాత్రులు మనం కలిసి చేసాం " అని రాకేష్ కౌంటర్ వేసరికి అందరూ పడీ పడీ నవ్వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



