
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘దాదా’. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని, ఒకటి రెండు రోజుల ప్యాచ్ వర్క్‌తో పాటు ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ పనులు పూర్తయితే షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయనున్నారట.
ఇటీవల కాకినాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 50 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించినట్లు సమాచారం. మరోవైపు సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లలోనూ వేగం పెంచారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ నెల 13న విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘దాదా ధమాకా’ కూడా సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర గురించి వినిపిస్తున్న ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. సాధారణంగా బాలయ్య సినిమాల్లో డ్యూయల్ రోల్స్ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కానీ ‘దాదా’లో మాత్రం ఆయన ఒకే పాత్రలో కనిపిస్తారట. అయితే ఆ పాత్రలోనే విభిన్న షేడ్స్, వేర్వేరు టైమ్‌లైన్స్ ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
రాయలసీమ నేపథ్యానికి, ముంబై మాఫియా ప్రపంచానికి మధ్య కథలో ఎలాంటి సంబంధం ఉంటుంది? ఒకే పాత్రలో బాలయ్య ఎన్ని రకాలుగా కనిపించబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘అఖండ 2’ వంటి సినిమాల్లో కనిపించిన లుక్స్‌కు భిన్నంగా ఈసారి న్యూ ఏజ్ స్టైలిష్ లుక్‌లో బాలకృష్ణ కనిపించనున్నారని సమాచారం. ‘కాంతార’ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి విజువల్స్ అందిస్తుండటం కూడా ఆసక్తిని పెంచుతోంది.
ఇది కూడా చదవండి: తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.!
‘దాదా’లో యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంటుందని టాక్. ముఖ్యంగా డాటర్ సెంటిమెంట్ కథలో కీలకంగా ఉండబోతోందట. గతంలో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’లో అన్నాచెల్లెళ్ల అనుబంధం, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘దాదా’లోనూ అదే స్థాయిలో ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయా? అనేది చూడాలి.
ఈ సినిమాలో శరత్ కుమార్, మనోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘భగవంత్ కేసరి’లో సరదా పాత్రలో కనిపించిన కాజల్ అగర్వాల్ ఈసారి చాలా సీరియస్ మోడ్‌లో కనిపించనున్నారని సమాచారం. ఇలా యాక్షన్, ఎమోషన్, విభిన్నమైన పాత్రలతో గోపీచంద్ మలినేని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ పోటీ కూడా ఆసక్తికరంగా మారుతోంది. క్రిస్మస్ సెలవులను లక్ష్యంగా చేసుకుని ‘దాదా’ను డిసెంబర్ 24న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే రోజున నాగార్జున నటిస్తున్న ‘కింగ్ 100’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు సీనియర్ స్టార్స్ సినిమాల మధ్య పోటీ నెలకొననుంది.
ఇటీవల అక్కినేని కుటుంబం నుంచి చైతన్య తండేల్‌తో, అఖిల్ లెనిన్‌తో హిట్లు అందుకోగా, నాగార్జున తన 100వ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న బాలకృష్ణ ‘అఖండ 2’ తర్వాత ‘దాదా’తో మరో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు.
మరి డిసెంబర్ 24న బాక్సాఫీస్ దగ్గర బాలయ్య, నాగార్జున సినిమాల మధ్య ఎలాంటి పోటీ నెలకొంటుంది? ఈ రెండు సినిమాల్లో ప్రేక్షకులను ఏది ఎక్కువగా ఆకట్టుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
మీకు నచ్చవచ్చు:
వారణాసి వాయిదా.. బాల్ రాజమౌళి కోర్టులో లేదా.?
క్యూట్ వీడియో.. గాయత్రీ మంత్రం చదివిన ప్రియాంక చోప్రా కూతురు.!
[Nandamuri Balakrishna, Dada Movie, Gopichand Malineni, Nagarjuna, King 100]




