ENGLISH | TELUGU  
Home  » Titbits

రాజమౌళి యస్.యస్. అంటే ఏమిటి...!

on Apr 21, 2011

రాజమౌళి యస్.యస్. అంటే ఏమిటి...! అంతే ఏమిటనేది సామాన్య ప్రేక్షకులకే కాదు... సినీ జనానికి కూడా తెలియని విషయం. అసలు తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ అంటే రాజమౌళి తండ్రి ఇంటి పేరు "వి" అన్నమాట. ఆయన కుమారుడైన రాజమౌళి ఇంటిపేరు "యస్.యస్" ఏమిటి...? లోకంలో ఎక్కడన్నా తండ్రికి ఒక ఇంటి పేరు... కొడుక్కి ఒక ఇంటి పేరూ ఉంటుందా...? ఉండదు కదా..మరి ఈ ఇద్దరి ఇంటి పేర్లలో ఈ తేడా ఏమిటి...? దీని వెనుక ఒక కథ ఉంది.

rajamouli wallpapers, rajamouli stills, rajamouli pics, rajamouli images, rajamouli photos, rajamouli pictures

వివరాల్లోకి వెళితే రాజమౌళి తలిదండ్రులు ప్రతి శివరాత్రికీ ఏదో ఒక జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకునేవారట. అలా ఒక శివరాత్రికి శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్ళారట.అక్కడ రాజమౌళి తల్లికి ఆ రాత్రి శ్వేతవస్త్రాలు ధరించిన స్వామీజీ కలలో కనిపించి పండంటి మగబిడ్డను ఆమె వొడిలో ఉంచారట. అలా శ్రీశైలం నుండి రాగానే రాజమౌళి కడుపులో పడ్డారట. అందుకనే రాజమౌళి జన్మించిన తర్వాత అతనికి "శ్రీ శైల శ్రీ రాజమౌళి" అని పేరు పెట్టారట.

 

అంతే గాని రాజమౌళీ ఇంటి పేరు అతని తండ్రి ఇంటి పేరూ రెండూ ఒకటే కానీ వేరు వేరు కాదు. "యస్.యస్." అంటే " శ్రీ శైల శ్రీ" అని అర్థం కానీ అది రాజమౌళి ఇంటిపేరు మాత్రం కాదు. నిజానికి రాజమౌళి పూర్తి పేరు "వి.శ్రీ శైల శ్రీ రాజమౌళి" అన్నమాట. ఆ పేరునే సినిమా పరిశ్రమ కోసం యస్.యస్.రాజమౌళిగా మార్చుకున్నారు రాజమౌళి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.