ENGLISH | TELUGU  
Home  » Titbits

రాజమౌళి ఈగ ఎందుకు తీస్తున్నాడు

on Mar 26, 2011

rajamouli wallpapers, rajamouli stills, rajamouli images, rajamouli pics, rajamouli photos, rajamouli   picturesరాజమౌళి ఈగ ఎందుకు తీశాడంటే తన దమ్మెంతో అందరికీ తెలియచెప్పటానికీ, ఒక దర్శకుడిగా తన ప్రతిభను సినీ పరిశ్రమలో ఒక పెద్ద మనిషికి ప్రాక్టికల్ గా చెప్పటానికి రాజమౌళి "ఈగ" చిత్రాన్ని తీస్తున్నాడట. విషయానికొస్తే "మగధీర" సినిమా షుటింగ్ సమయంలో, షాట్ గ్యాప్ లో, షూటింగ్ చూట్టానికి వచ్చిన ఒక సినీ ప్రముఖుడు ఎవరో రాజమౌళిని తెగపొగుడుతున్నాడట.

అది గమనించిన ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ "ఇదిగో చూడూ...యన్ టి ఆర్, ప్రభాస్, రవితేజ వంటి పవర్ ఫుల్‍ మాస్ హీరోలతో రాజమౌళి ఏంటయ్యా నువ్వు కూడా హిట్టివ్వచ్చు. అదేమంత పెద్ద గొప్పవిషయం కాదులే." అని అన్నారట. ఆ సంఘటన జరిగిన అరగంటకు అటుగా వెళ్తున్న కమెడియన్ సునీల్ డైరెక్టర్ రాజమౌళిని పలకరించి పోదామని వచ్చాడట.

లోపల తనను అల్లు అరవింద్ అన్న మాటలకు మండిపోతున్న రాజమౌళి వెంటనే సునీల్ ని హీరోగా పెట్టి సినిమా తీయటానికి నిర్ణయించుకున్నాడట. అలా "మర్యాదరామన్న" సినిమా తీశాక...కూడా "సునీల్ ఏ హీరోకన్నా తక్కువయ్యా" అన్నారట అల్లు అరవింద్. ఇలా కాదనీ అసలు ఒక అల్ప జీవిని హీరోగా పెట్టి సినిమా తీసి హిట్ చేసి చూపిస్తే ఇక తన మీద కామెంట్ చేయటానికి ఎవరూ సాహసించరని ఈ "ఈగ" చిత్రాన్ని ప్రారంభించాడట రాజమౌళి. ఆ విధంగా "ఈగ" చిత్రానికి అంకురార్పణ జరిగింది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.