గిరీష్ కర్నాడ్... గొప్ప రచయిత కూడా!
on Jun 10, 2019
.jpg)
ఎక్కువశాతం మంది ప్రేక్షకులకు గిరీష్ కర్నాడ్ నటుడిగా తెలుసు. తెలుగులో 'ఆనంద భైరవి', 'ధర్మ చక్రం', 'కొమరం పులి' తదితర చిత్రాల్లో నటించిన పలు కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించారు. సల్మాన్ ఖాన్ 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' చిత్రాల్లో రా చీఫ్ పాత్రలో నటించారు. ఆయన మంచి నటుడు మాత్రమే కాదు, గొప్ప రచయిత కూడా. బహుభాషా కోవిదుడు. కన్నడలో ఆయన చేసిన రచనలకు గాను అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్ ను 1998లో అందుకున్నారు. అంతకు ముందు 1992లో పధంభూషణ్, 1974లో పద్మశ్రీ పురస్కారాలు ఆయన్ను చాయి. వెండితెరపై నటుడిగా అడుగు పుట్టకముందు నాటక రంగంలో ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. నాటకకర్తగా ఆయన సాధించిన విజయాలు వెండితెరకు పరిచయం చేశాయి. సినిమా నటుడిగా ఎన్ని విజయాలు సాధించినా, నటుడిగా ఆయన పోషించిన పాత్రలు ఎంత పేరు తెచ్చినా... గిరీష్ కర్నాడ్ సంతృప్తి చెందలేదు. సంతోషపడలేదు. సినిమా అవకాశాలు జేబు నింపాయి తప్ప మనసు నింపలేదనీ, సినిమా రంగం జీవితానికి కావలసిన సకల సదుపాయాల్ని సమకూర్చింది కానీ సంతృప్తిని ఇవ్వలేదని ఆయన ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించారు. రచయితగా గిరీష్ కర్నాడ్ ఎక్కువ సంతోషపడేవారు. రచనల్లో సంతృప్తి దొరుకుతుందని అనేవారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



