యంగ్‌టైగర్‌ను భయపెడుతున్న కబాలి
on Jul 3, 2016

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాను ఆగస్టు 12న విడుదల చేస్తామని మూహుర్తపు షాట్ రోజే ప్రకటించారు. అన్నట్లుగానే చాలా స్పీడుగా షూటింగ్‌ను కంప్లీట్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ నెలలోనే పాటు రిలీజ్ చేసి..ఆగస్టు 12 సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ రూపంలో పెద్ద అడ్డంకి ఎదురు కాబోతోంది. రజనీ నటించిన కబాలీ సినిమా ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి జులై 15న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే అప్పుడు కూడా సినిమా విడుదలవ్వడం అనుమానంగా కనిపిస్తోంది. అటు ఇటైతే డేట్ ఆగస్టు 12కు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే నిజమైతే జనతా గ్యారేజ్‌కు తిప్పలు తప్పవు. ఇదే ఎన్టీఆర్‌ను ఇప్పుడు భయపెడుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



