త్రివిక్రమ్ విడుదల చేసిన 'అవసరానికో అబద్ధం' ట్రైలర్
on Jul 3, 2016
'అవసరానికో అబద్ధం' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని చిత్ర రచయిత, దర్శకుడు సురేష్ కెవి తెలిపారు.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... అవసరానికో అబద్ధం చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. ముఖ్యంగా డైలాగ్స్ బాగా నచ్చాయి. సినిమాను బాగా ప్రమోట్ చేసి, మౌత్ పబ్లిసిటీతో సినిమా విజయవంతం అయ్యేలా ప్రయత్నించండి. అప్పట్లో మా స్వయంవరం చిత్రం టాక్ కూడా స్లోగా స్టార్ట్ అయ్యి బాగా పికప్ అందుకొని విజయవంతంగా 175 రోజులు పూర్తి చేసుకుంది. అవసరానికో అబద్ధం చిత్ర యూనిట్ అందరికీ ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. అని అన్నారు.
చిత్ర రచయిత, దర్శకుడు సురేష్ కెవి మాట్లాడుతూ... మా అవసరానికో అబద్ధం చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. సినిమాలోని డైలాగ్స్ ను మాటల మాంత్రికుడు మెచ్చుకోవడం మాకు పెద్ద కాంప్లిమెంట్. నాపై ఉన్న నమ్మకంతో చిత్రాన్ని నిర్మించిన నా స్నేహితులకు... సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా రావడానికి కృషి చేసిన మా టీంకు, సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రమోషనల్ పార్ట్ నర్ గా వ్యవహరిస్తున్న శ్రియాస్ మీడియాకు కృతజ్ఞతలు తెలిజయేస్తున్నాను. నిజమని నువ్వు నమ్మేదాన్ని నిజమని నీకు చెప్పిందెవరు? అబద్దమని నువ్వు అనుకొనే దాన్ని అబద్దమని నీకు చెప్పిందెవరు? అనే ఆలోచనకు ప్రతి రూపమే అవసరానికో అబద్ధం. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రంలోని సన్నివేశాలు అందరినీ కట్టిపడేసేలా తెరకెక్కించాం. అవసరం మనిషికి అందించే అతి శక్తివంతమైన ఆయుధం. దాని చుట్టూ అల్లుకున్న కథే మా ఈ చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మంచి రిలీజ్ డేట్ కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా గురువు గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మా చిత్ర యూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అని అన్నారు.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



