ప్రభాస్‌ని అడ్డుకున్న దుబాయ్..!!
on Feb 27, 2018
.jpg)
ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్, సోషల్ మీడియా ఏదైనా ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్న సిటీ దుబాయ్.. గల్ఫ్ దేశాలకే తలమానికంగా నిలుస్తున్న ఈ నగరం.. బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్, అతిలోకసుందరి శ్రీదేవి మరణంతో ఈ అరబ్ నగరం ప్రతీ రోజు వార్తల్లో నిలుస్తోంది. సరే.. ఈ సంగతి పక్కనబెడితే.. ప్రజంట్ సుజిత్ దర్శకత్వంలో సాహో అనే సినిమా చేస్తున్నాడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి రిలీజ్ చేయాలని శరవేగంగా షూటింగ్ జరుపుతోంది సాహో టీం. ప్రస్తుతం సినిమాకే హైలెట్‌గా నిలిచే యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దీనిని ముందుగా దుబాయ్‌లో తీయాలని అనుకున్నారట.. అయితే లోకల్ అధికారులు షూటింగ్‌కు పర్మిషన్ ఇవ్వలేదట.. మరోసారి రిక్వెస్ట్ చేస్తే.. అనుమతి ఇచ్చినప్పటికీ.. షూటింగ్ ఫీజు కింద భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారట. ఇప్పటికే బడ్జెట్ లిమిట్ దాటడంతో నిర్మాతలు తలపట్టుకున్నారట. కాస్ట్ కటింగ్ ప్రాసెస్‌లో భాగంగా ఈ సీన్‌ని రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీయాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే ఆర్‌ఫీసీలో సెట్ వేస్తున్నారట. అతి త్వరలో షెడ్యూల్ ప్రారంభమవుతుందని ఫిలింనగర్ టాక్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



