క్లియరెన్స్ వచ్చింది.. ఇంకా రెండుగంటలు గడిస్తేకానీ..
on Feb 27, 2018
.jpg)
మూడు రోజుల నిరీక్షణ.. కోట్లాది మంది ఎదురుచూపులు.. శనివారం రాత్రి మరణిస్తే.. ఇంతవరకు శ్రీదేవి భౌతికకాయం భారతదేశానికి రాలేదు. అనుమానాస్పద స్థితిలో మరణించడం.. ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యమవ్వడంతో.. శ్రీదేవి పార్థీవ దేహాన్ని అప్పగించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఆమె భౌతిక కాయాన్ని త్వరగా ఇండియాకి పంపాల్సిందిగా భారత్‌లోని అత్యున్నత స్థాయి వర్గాలు.. దుబాయ్ ప్రభుత్వాధికారుల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చాయి. ఆదివారం నుంచి నిన్న అర్థరాత్రి వరకు దుబాయ్‌కి ఫోన్లు వెళుతూనే ఉన్నాయి. కానీ చట్టాల ప్రకారం పనిచేసే అక్కడి యంత్రాంగం అందుకు ఒప్పుకోలేదు. చివరకు ఇవాళ మధ్యాహ్నానికి ప్రాసిక్యూషన్ అధికారులు క్లియరెన్స్ లేఖ ఇచ్చారు. శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఆ తరువాత ఆమె పార్థీవ దేహాన్ని ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకురానున్నారు.. ఈ వ్యవహారాన్ని దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ పర్యవేక్షిస్తోంది. రాత్రి 10 గంటలకు శ్రీదేవి భౌతికకాయం ముంబైకి చేరుకునే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



