Home

»

Latest News

`టాక్సీవాలా` భామ‌.. ఈ ఏడాది హ్యాట్రిక్ కొడుతుందా!

Dec 9, 2021 10:33AM

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టించిన `టాక్సీవాలా` (2018)తో తొలి విజ‌యాన్ని అందుకుంది తెలుగ‌మ్మాయి ప్రియాంక జ‌వాల్క‌ర్. ఆ సినిమా కంటే ముందు.. `క‌ల వ‌రం ఆయే` (2017)తో ప‌ల‌క‌రించిన ప్రియాంక‌.. రెండో చిత్రంతోనే టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోగ‌లిగింది. `టాక్సీవాలా` హిట్ సినిమాల జాబితాలో చేరినా.. ఆల‌స్యంగానే అవ‌కాశాలు అందుకుంటూ వ‌చ్చింది ప్రియాంక‌.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది వ‌రుస చిత్రాల‌తో అల‌రిస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్. ఇప్ప‌టికే స‌త్య‌దేవ్ కి జోడీగా `తిమ్మ‌రుసు`, కిర‌ణ్ అబ్బ‌వ‌రంకి జంట‌గా `ఎస్ ఆర్ క‌ళ్యాణమండ‌పం` చిత్రాల్లో క‌నిపించి బ్యాక్ టు బ్యాక్ డీసెంట్ హిట్స్ ని అందుకున్న ప్రియాంక‌.. ఈ వారం `గ‌మ‌నం` సినిమాలో సంద‌డి చేయ‌నుంది. ఇందులో ముస్లిమ్ అమ్మాయి జారా పాత్ర‌లో స‌రికొత్త‌గా క‌నిపించ‌నుంది మిస్ జ‌వాల్క‌ర్. మ‌రి.. ఇప్ప‌టికే ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో రెండు చెప్పుకోద‌గ్గ విజ‌యాలు చూసిన ప్రియాంక జ‌వాల్క‌ర్.. `గ‌మ‌నం`తో ఈ సంవ‌త్స‌రం హ్యాట్రిక్ అందుకుంటుందేమో చూడాలి.

కాగా, సుజ‌నా రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `గ‌మ‌నం`లో శ్రియ‌, శివ కందుకూరి, నిత్యా మీన‌న్, సుహాస్, చారు హాస‌న్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య‌రాజా ఈ సినిమాకి సంగీత‌మందించారు. డిసెంబ‌ర్ 10న `గ‌మ‌నం` తెర‌పైకి వ‌స్తోంది.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com