పరుగులు పెట్టిస్తున్న విశాల్! మా రత్నం అంతే అంటున్న ఫ్యాన్స్
on Jan 1, 2024

తమిళ సినీ ప్రేమికులు విప్లవ కమాండర్ గా పిలుచుకునే విశాల్ నుంచి తాజాగా వస్తున్న మూవీ పేరు రత్నం. సింగం సిరీస్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మీద తమిళ,తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం రత్నం టైటిల్ తో పాటు టీజర్ ని విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ఒక అదిరిపోయే సాంగ్ ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ సాంగ్ విడుదలైన కాసేపట్లోనే రికార్డు స్థాయి వ్యూయర్స్ తో ముందుకు దూసుకెళ్తుంది.
రత్నం నుంచి నూతన సంవత్సర కానుకగా రారా రత్నం అనే పాటని మేకర్స్ విడుదల చేసారు. పాట అనే కంటే విశాల్ ఈ సారి రత్నం ద్వారా దక్షిణ భారతీయ చిత్ర సీమలో ప్రళయం సృషించబోతున్నాడని చెప్పవచ్చు. చిన్న పాటి టీజర్ తో విడుదల చేసిన ఆ సాంగ్ లో విశాల్ గెటప్, చూపులు ఒక రేంజ్ లో ఉన్నాయి.ఆ సాంగ్ కి రేపు థియేటర్స్ లో విశాల్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చెయ్యడం ఖాయం. అలాగే పాట లిరిక్స్ అయితే మన ఒంట్లో ఉన్న రక్తాన్ని పరుగులు పెట్టించే విధంగా ఉన్నాయి. వివేక్ సాహిత్యంలో షేన్ బాగరాజ్ ఆలపించిన ఆ పాటకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే కంపోజ్ ని అందించాడు.

విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా సముద్ర ఖని,యోగి బాబు, గౌతమ్ వాసుదేవమీనన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు హరి ఎంతో ప్రేస్టీజియస్ట్ గా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ రత్నానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తుండగా జీ స్టూడియోస్ అండ్ పెన్ స్టూడియో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



