ఆ వీడియోతో హేటర్స్ కి దూల తీర్చేసిన అనసూయ!
on Jan 1, 2024
.webp)
సోషల్ మీడియాలో కాంట్రవర్సీ క్వీన్ గా స్టార్ రేటింగ్ తెచ్చుకున్న అనసూయ ఏం మాట్లాడినా దాన్ని భూతద్దం వేసుకుని చూసేవాళ్ళు చాల మంది ఉంటారు. అలాంటి అనసూయ ఏ వీడియో పెట్టినా అది దుమ్ము రేపుతోంది. 2023 లో ఆమె ఎన్నో కాంట్రావర్సీల్లో ఇరుక్కుంది. ఆ విషయం అందరికీ తెలుసు. అలాంటి అనసూయ ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘‘2023లో నా వల్ల ఎవరైతే ఇబ్బందిపడ్డారో.. నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎవరినైతే నేను బాధపెట్టానో మీ అందరికీ.. మంచిగయ్యింది. ఇంకొకసారి నా జోలికి రావద్దు. నెక్ట్స్ ఇయర్ కూడా ఇలాగే రిపీట్ చేస్తే దూల తీర్చి దూపమేస్తాను’’ అంటూ ఒక డబ్‌స్మాష్ వీడియోను షేర్ చేసింది అనసూయ. తన హేటర్స్ కి వార్నింగ్ ఇస్తున్నట్టు వున్న ఈ జోక్ వీడియో దగ్గర ‘‘నేను జోక్ చేస్తున్నా. సీరియస్ కాదు’’ అంటూ క్యాప్షన్ పెట్టుకుంది.

బుల్లితెర మీద యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. వెండితెర మీద కూడా రాణిస్తోంది. 'క్షణం'తో నటిగా మారి మొదటి సినిమాతో ఆకట్టుకుంది. ఇక ‘రంగస్థలం’ మూవీ ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. ఆమె యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన దర్శకుడు సుకుమార్.. తన తరువాతి మూవీ ‘పుష్ప’లో కూడా ఒక కీ రోల్ ఇచ్చాడు. ఇక ఈ మూవీతో బ్రేక్ వచ్చేసరికి అనసూయకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం ఆమె మూవీస్ తో చాలా బిజీ అయిపోయింది. అందుకే బుల్లితెరకు కూడా బైబై చెప్పేసింది. ప్రస్తుతం అనసూయ ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే తమిళ చిత్రంతో పాటు ‘పుష్ప పార్ట్ 2’లో కూడా నటిస్తోంది అనసూయ. పుష్ప పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో తన పాత్రకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే రివీల్ చేసింది అనసూయ. ఇక అనసూయ నటించిన విమానం మూవీకి మంచి ప్రశంసలు కూడా దక్కాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



