కరిష్మాను చూసి కోహ్లీ పడిపోయాడట..!
on May 26, 2016
ప్రపంచ క్రికెట్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న పేరు విరాట్ కోహ్లీ. విధ్వంసకారుడిగా, సమకాలీన క్రికెట్ ప్లేయర్లలో అత్యుత్తమంగా అతన్ని కొనియాడే వాళ్లకు లెక్క లేదు. కోట్లాది మంది కోహ్లీని ఆరాధిస్తున్నారు. సచిన్ తర్వాత మరో క్రికెట్ దేవుడిగా విరాట్ ను చూసుకుంటున్నారు భారత క్రికెట్ అభిమానులు. ఇండియా వైడ్ గా కోహ్లీపై మనసు పడుతున్న అమ్మాయిలకైతే లేక్కే లేదు. అయితే మనోడు బాలీవుడ్ భామ అనుష్క శర్మను తగులుకున్నాడు. ఇద్దరి ప్రేమాయణం బాగానే ఉందనుకున్న సమయంలో, బ్రేకప్ వార్తలు అభిమానులకు కాస్త బెంగ కలిగించాయి. ఇంతకూ ఇంత మంది ఆరాధిస్తున్న కోహ్లీకి మొదటి క్రష్ అనుష్క కాదు. అంతకు ముందే కరిష్మా కపూర్ ను చూసి బాబు ఫ్లాట్ అయిపోయాడట. అయితే అప్పటికి మనోడిది నిక్కర్లు వేసుకునే వయసు లెండి. కరిష్మా కపూర్ తన మొదటి సెలబ్రిటీ క్రష్ అని ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు విరాట్. ఇప్పుడైతే ఫేడవుట్ గానీ, ఒకప్పుడు కరిష్మాకు ఇండియా వైడ్ భారీ ఫాలోయింగే ఉండేది. ఆ ఫ్యాన్స్ లో కోహ్లీ కూడా ఒకడన్న మాట. ఇప్పుడిప్పుడే విరాట్ తో ప్యాచప్ అవుతున్న అనుష్క, ఈ మాటలకు ఎలా స్పందిస్తుందో మరి..