సుప్రీమ్ హీరో రఫ్పాడిస్తున్నాడుగా..!
on May 26, 2016
ఒకరి నష్టం మరొకరికి లాభంగా మారుతుంటుంది మన ఇండస్ట్రీలో. రీసెంట్ గా రిలీజైన బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్, మిగిలిన సినిమాలకు లాభంగా మారింది. ఏకంగా మహేష్ సినిమాను తీసేసి, మెగా హీరో సుప్రీం ను హాళ్లలోకి తీసుకొస్తున్నారు. నిజానికి బ్రహ్మోత్సవం రిలీజైన తర్వాత తమ పరిస్థితేంటి అన్న భయం తోటి సినిమాలకు ముందు నుంచే ఉంది. కనీసం యావరేజ్ సినిమా అయినా బ్రహ్మోత్సవం జనాన్ని థియేటర్లకు రప్పించి ఉండేది. అయితే సినిమా మరీ ఘోరంగా విఫలమవడం, తొలి రోజే డిజాస్టర్ టాక్ రావడం సాయి థరమ్ కు కలిసొచ్చింది. తమకు దెబ్బ కొడుతుందనుకున్న సినిమాయే, ఇన్ డైరెక్ట్ గా ఫుల్ ఫ్రాఫిట్స్ తెచ్చి పెడుతోంది. రిలీజైన మూడు వారాలకు సుప్రీం థియేటర్స్ నుంచి బయటకు వచ్చేస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఆశ్చర్యంగా, నాలుగో వారంలో మరిన్ని థియేటర్స్ పెంచుకుని మరీ సుప్రీం రప్ఫాడిస్తున్నాడు. బ్రహ్మోత్సవాన్ని తీసేసి, చాలా చోట్ల సుప్రీంను వేస్తున్నారు. హైదరాబాద్ లోనే ఏకంగా ఐదు థియేటర్లు సుప్రీంకు కేటాయించారంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఫ్యామిలీలను ఆకట్టుకోవడంలో మహేష్ సినిమా పూర్తిగా విఫలమవ్వడం, మాస్ ఆడియన్స్ కు సుప్రీం కనెక్ట్ అవడం, మరింత ప్లస్ అయింది. ఇప్పటికే సుప్రీం 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సాయి ధరమ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.