పవన్ కోసం పవర్ ఫుల్ కథ...!
on May 14, 2017
బాహుబలి పార్ట్ 1 సినిమా నే రికార్డులు బద్దలు కొట్టిందనకుంటే.. పార్ట్ 2 అంతకుమించి రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా వల్ల దర్సకుడు రాజమౌళికి కానీ.. అందులో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ అందరికీ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపే లభించింది. వీరందరితో పాటు అసలు ఈ కథ సృష్టికర్త అయిన విజయేంద్ర ప్రసాద్ కు కూడా మంచి పేరే వచ్చింది. బాహుబలి, భజరంగీ బాయ్ జాన్ సినిమాలతో విజయేంద్ర ప్రసాద్ జాతీయ స్థాయిలో స్టార్ రైటర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్న విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కోసం ఓ సినిమా రాస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, నిజాయితీ అంటే తనకెంతో ఇష్టమన్న విజయేంద్ర ప్రసాద్.. ఆ అంశాలతోనే ఆయన కోసం ఓ పవర్ ఫుల్ కథను రెడీ చేస్తానని తెలిపాడు. దీంతో త్వరలోనే ఆ కథ రెడీ అయ్యే ఛాన్స్ ఉందంటూ పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడు కథ రాస్తారు.. ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు.. ఆ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.