మాహిష్మతిని వీడిన శివగామి.. మాతంగిగా వచ్చిందా..!
on May 14, 2017
బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ద్వారా రమ్యకృష్ణ ఆ పాత్రకే ప్రాణం పోసింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. సినిమా చూసిన తరువాత ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేం. ఇప్పుడు ఆ పాత్రనే ఇంకా మరిచిపోలేదు అంటే.. ఇప్పుడు మరో గెటప్ తో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కూతురి సెంటిమెంట్‌తోపాటు క్షుద్రశక్తులతో పోరాటాన్ని ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ‘మాతంగి’లో రమ్య లీడ్‌రోల్ పోశించింది. మలయాళంలో రూపొందిన ఈ సినిమా.. తెలుగులో కూడా రానుంది. జూన్‌లో విడుదలకానున్న ‘మాతంగి’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ గెటప్ చూసి పలువురు పలు రకాలుగా కామెంట్లు విసురుతున్నారు. ‘మాహిష్మతి నుంచి వెళ్లిపోయిన శివగామి.. మళ్లీ మాతంగిగా వచ్చింది..’ అని కొందరు అంటే.. ‘ఆవిడ(రమ్య) ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలర’ని ఇంకొందరు పొగడ్తలు కురిపించారు. మొత్తానికి తాను ఏపాత్రలోనైనా ఒదిగిపోగలనని మరోసారి నిరూపించారు రమ్యకృష్ణ.