వంశీ కోసం విజయ్ ద్విపాత్రాభినయం!
on Jan 8, 2022

గత ఏడాది సంక్రాంతికి `మాస్టర్` రూపంలో మంచి విజయం అందుకున్నారు కోలీవుడ్ స్టార్ విజయ్. ప్రస్తుతం `బుట్టబొమ్మ` పూజా హెగ్డేతో కలిసి `బీస్ట్` సినిమా చేస్తున్న విజయ్.. ఏప్రిల్ నెలలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో సందడి చేయనున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. `బీస్ట్` తరువాత టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో విజయ్ ఓ బైలింగ్వల్ మూవీ చేయబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించనున్నారు. కాగా, ఈ సినిమాలో విజయ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఓ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తుందని అంటున్నారు. అదే గనుక నిజమైతే.. `అళగియ తమిళ మగన్`, `విల్లు`, `కత్తి`, `పులి`, `మెర్సల్` (మూడు పాత్రలు), `బిగిల్` తరువాత విజయ్ ద్విపాత్రాభినయం చేసే సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే వంశీ పైడిపల్లి చిత్రంలో విజయ్ డ్యూయెల్ రోల్స్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



