ప్రభాస్ కి ప్రాణగండం.. విజయ్ సూసైడ్.. వేణుస్వామి సంచలన ఆడియో లీక్..!
on Mar 21, 2025
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచాడు. సినీ స్టార్స్ ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంతలలో ఒకరు ఆత్మహత్య చేసుకునే అవకాశముంది అంటూ వేణుస్వామి మాట్లాడిన ఆడియో ఒకటి లీక్ అయింది.
జ్యోతిష్యం పేరుతో ప్రముఖుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడి విమర్శల పాలవుతుంటాడు వేణుస్వామి. గతంలో ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేశాడు. ముఖ్యంగా నాగచైతన్య-శోభిత ఎక్కువ కాలం కలిసి ఉండరని, విడాకులు తీసుకుంటారని వేణుస్వామి జ్యోతిష్యం చెప్పడం తీవ్ర వివాదాస్పదమైంది. అందరూ ఆయన తీరుని తప్పుబట్టడంతో పాటు, మహిళా కమిషన్ కూడా సీరియస్ అవ్వడంతో.. బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. ఇలా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ వేణుస్వామి తీరులో మాత్రం మార్పు రావడంలేదు. పైగా, జాతకం బాలేదంటూ ప్రముఖులను భయపెట్టి, పూజల పేరుతో లక్షలు కాజేయడం ఆయన పని అని ఆరోపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా వివాదాలతో సహవాసం చేసే వేణుస్వామి.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు.
ప్రభాస్, విజయ్, సమంత గురించి వేణుస్వామి మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. "నేను ముగ్గురు చనిపోతారని చెప్పా. అప్పుడు నన్ను బాగా విమర్శించారు. ఒకరు సూసైడ్ చేసుకుంటారు. ఒక హీరో, ఒక హీరోయిన్ చనిపోతారని చెప్పా. నేను చెప్పింది విజయ్ దేవరకొండ, ప్రభాస్, సమంత. ముగ్గురిలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుంటారు. నా లెక్క ప్రకారం విజయ్ చేసుకుంటాడు. ప్రభాస్ కి హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉన్నాయి." అని ఆ ఆడియో క్లిప్ లో వేణుస్వామి కామెంట్స్ చేసినట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు వేణుస్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
