‘స్పిరిట్’కి ముహూర్తం ఫిక్స్.. రెడీ అవుతున్న ప్రభాస్, సందీప్!
on Mar 21, 2025
అర్జున్‌రెడ్డి, యానిమల్ వంటి హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ డ్రామా చిత్రాలతో ఒక డిఫరెంట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్, సలార్, కల్కి వంటి సినిమాలతో వరల్డ్‌వైడ్‌గా క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ ఒక రేంజ్‌లో ఉండడం సహజం. ఎప్పుడైతే ప్రభాస్, సందీప్ కాంబినేషన్‌లో స్పిరిట్ పేరుతో ఓ పవర్‌ఫుల్ సినిమా చేస్తున్నామని ప్రకటించారో అప్పటి నుంచి ఆ సినిమా అప్‌డేట్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరికీ చిత్ర యూనిట్ ఓ గుడ్‌న్యూస్ చెప్పబోతోంది. ప్రభాస్ ఇమేజ్‌కి, అతని కాలిబర్‌కి తగిన కథను సిద్ధం చేసేందుకు సందీప్ ఇంత టైమ్ తీసుకున్నారు. ఇప్పుడు స్పిరిట్ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ సిద్ధం అయిందట. మార్చి 30న ఉగాది పర్వదినాన ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే రెగ్యులర్ షూటింగ్‌కి మాత్రం ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభాస్.. రాజాసాబ్ పూర్తి చేయాల్సి ఉంది. మరో పక్క ఫౌజీ కూడా షూటింగ్ జరుగుతోంది. అందుకే కొంత సమయం తీసుకున్న తర్వాత స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు.
రెబల్‌స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898ఎడి చిత్రం విడుదలై 9 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్ సినిమా రిలీజ్‌కి రాలేదు. అయితే ప్రభాస్ తన లైనప్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. తన నెక్స్‌ట్ రిలీజ్‌గా భావిస్తున్న రాజా సాబ్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దాదాపు షూటింగ్ పూర్తయినా కొంత ప్యాచ్ వర్క్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఉండడంతో మరికొంత సమయం పట్టేలా ఉంది. ఏది ఏమైనా ఈ సంవత్సరంలోనే రాజా సాబ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరో పక్క ఫౌజీ షూటింగ్ జరుగుతున్నప్పటికీ అనుకున్నంత వేగంగా జరగడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా కమిట్ అయ్యాడు ప్రభాస్. ఇవన్నీ ఇలా ఉంటే.. సలార్2, కల్కి2 చిత్రాల పరిస్థితి ఏమిటి అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ప్రశాంత్ నీల్ డ్రాగన్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ వార్2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అది పూర్తి చేసుకొని ఏప్రిల్ నుంచి డ్రాగన్ సెట్స్‌కి వస్తారు.
ఓపక్క ప్రభాస్, మరో పక్క ప్రశాంత్ నీల్ తమ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్‌తో చేస్తున్న డ్రాగన్ కాకుండా ప్రశాంత్ నీల్ కమిట్ అవ్వాల్సిన సినిమాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో సలార్2 చిత్రం సెట్స్‌కి ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మరో పక్క ప్రభాస్.. కల్కి2 కూడా పూర్తి చేయాల్సి ఉంది. మేకర్స్ చెప్తున్న దాన్నిబట్టి ఇప్పట్లో కల్కి2 మొదలు పెట్టే అవకాశం లేదు. ఈ చిత్రాన్ని 2028లో రిలీజ్ చేస్తామని మాత్రం చెప్తున్నారు. అయితే కల్కి2 అనే ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే సందేహం కూడా కొందరిలో ఉంది. పార్ట్ 1తోనే సరిపెట్టాలనే ఆలోచనలో నాగ్‌అశ్విన్, అశ్వినీదత్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, ప్రభాస్‌కి ఉన్న కమిట్‌మెంట్స్‌ని బట్టి చూస్తే 2028లో కూడా కల్కి2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
