కళ్లల్లో నీళ్లు తిరిగాయి- వెంకటేష్
on Jan 19, 2019
వెంకటేష్ కామెడీ టైమింగ్ కి తగ్గ కాన్సెప్ట్ పడాలనే కానీ, ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడం ఖాయం అంటుంటారు. అలా` నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తర్వాత అనిల్ రావిపూడి , వెంకటేష్ శైలిలో `ఎఫ్ 2` చిత్రాన్ని తెరకెక్కించాడు. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి చిత్రాల్లో సక్సెస్ సాధించి బ్లాక్ బస్టర్ బొమ్మగా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లో `ఎఫ్2` సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ... ``సినిమా హిట్ సూపర్ హిట్ అనుకుంటే...ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు. మనస్పూర్తిగా ప్రేక్షకుల కళ్లలో ఆనందం చూసినపుడు ...పదేళ్ల తర్వాత థియేటరకు వెళ్ళి అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి నాకు కళ్లలో నీళ్ళు ఆగలేదు. మేం కష్టపడి చేసినపుడు...అది ప్రేక్షకులకు నచ్చినప్పుడు వచ్చే ఆనందమే వేరు. గణేష్, ప్రేమించుకుందాంరా, బొబ్బిలి రాజా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి ఇలా చాలా సినిమాలను నాకు సక్సెస్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. మీరు మళ్లీ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేయాలి...అని ఆడియన్స్ అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు హెల్పయ్యాయి. వరుణ్, తమన్నా, మెహరీన్ చాలా బాగా నటించారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు`` అన్నారు.