మహేష్ ట్వీట్స్ వెనుక మర్మం అదేనా?
on Jan 19, 2019
'ఎఫ్ 2' ట్రైలర్ విడుదలైన వెంటనే మహేష్‌బాబు ట్వీట్ చేశారు. సినిమా యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా విడుదలైన తరవాత మరోసారి ట్వీట్ చేశారు. సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. ఆల్మోస్ట్ ఆ ట్వీట్ రివ్యూలో వెంకటేష్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడిని మెచ్చుకున్నారు. వెంకటేష్‌తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో నటించారు మహేష్. ఆ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఇప్పుడీ 'ఎఫ్ 2'కీ నిర్మాత ఆయనే. ప్రస్తుతం మహేష్‌బాబు నటిస్తున్న 'మహర్షి' నిర్మాత కూడా దిల్ రాజే. అటు వెంకటేష్.. ఇటు దిల్ రాజు.. వీళ్లిద్దరి కోసం సినిమా చూసి బావుండటంతో ట్వీట్ చేశారని ప్రేక్షకులు అనుకున్నారు. అయితే మహేష్ ట్వీట్స్ వెనుక మర్మం వేరే వుందట!
'ఎఫ్ 2' విడుదలకు ముందే మహేష్ బాబును కలిసిన అనిల్ రావిపూడి టూకీగా ఓ కథ చెప్పారట. గతంలో మహేష్ సినిమాలకు అనిల్ రచయితగా వర్క్ చేశారు. ఇద్దరికీ పరిచయం వుంది. అనిల్ కామెడీ టైమింగ్ మహేష్ బాబుకు తెలుసు. స్టోరీలైన్ విన్న మహేష్, కంప్లీట్ స్టోరీ డెవలప్ చేసుకు రమ్మని అడిగారట. ఈలోపు విడుదలైన 'ఎఫ్ 2' చూసి ట్వీట్ రివ్యూ ఇచ్చారు. 'పటాస్', 'రాజా ది గ్రేట్', 'సుప్రీమ్', 'ఎఫ్ 2' వరుసగా నాలుగు విజయాలతో అనిల్ రావిపూడి రెట్టించిన ఉత్సాహంలో వున్నారు. అతడి ట్రాక్ రికార్డు చూస్తే మహేష్ బాబు సినిమా చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.