మట్కా గురించి వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
on Aug 24, 2023
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కమర్షియల్ సినిమాలే చేయాలనే రూల్ పెట్టుకోకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’. ఆగస్ట్ 25న మూవీ రిలీజ్ అవుతుంది. దీని తర్వాత ఈ మెగా వారసుడు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్ ఒకటి. మానుషి చిల్లర్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 8న మూవీ రిలీజ్ కానుంది. ఇది ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనుంది.
దీంతో పాటు కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ అనే సినిమాను చేస్తున్నారు. 1958 -1982 మధ్య నడిచే కథాంశంతో తెరకెక్కబోతున్న పీరియాడిక్ మూవీ ఇది. అప్పటి పరిస్థితుల్లో దేశాన్ని వణికించిన కొన్ని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని ‘మట్కా’ తెరకెక్కతుంది. అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తి కరమైన విషయాన్ని చెప్పారు వరుణ్ తేజ్. అదేంటంటే ఇప్పటి వరకు తాను చేయని విధంగా నాలుగు షేడ్స్ లో తన పాత్ర ఉంటుందని, 21 ఏళ్ల వయసు నుంచి 48 ఏళ్ల వ్యక్తి వరకు తన పాత్ర కనిపిస్తుందని వరుణ్ రీసెంట్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రియాసేత్ సినిమాటోగ్రాఫర్. వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. మోహన్ చెరుకూరి, విజేందర రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read