'కింగ్ ఆఫ్ కొత్త' ఫస్టాఫ్ రివ్యూ: దుల్కర్ దుమ్ము దులిపేశాడు!
on Aug 24, 2023
'మహానటి', 'సీతారామం' చిత్రాలతో తెలుగువారికి చేరువైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. తాజాగా ఈ యంగ్ హీరో నుంచి వచ్చిన సినిమా 'కింగ్ ఆఫ్ కొత్త'. ప్రధానంగా మలయాళంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. గురువారం (ఆగస్టు 24) తెలుగులోనూ విడుదలైంది. నూతన దర్శకుడు అభిలాష్ జోషి తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించగా, ప్రసన్న ఓ ముఖ్య పాత్రలో అభినయించాడు. 2 గంటల 55 నిమిషాల నిడివితో 'కింగ్ ఆఫ్ కొత్త' జనం ముందు నిలచింది.
ప్రస్తుతం థియేటర్స్ లో ప్రదర్శితమవుతున్న 'కింగ్ ఆఫ్ కొత్త' ఫస్టాఫ్ పూర్తిచేసుకుంది. ఫస్టాఫ్ పై వచ్చిన రివ్యూ ఎలా ఉందంటే.. దుల్కర్ సల్మాన్ పోషించిన రాజు పాత్ర ఆసక్తికరంగా ఉందని, యాక్టింగ్ కూడా ఎప్పటిలాగే అదరగొట్టాడని చెబుతున్నారు. అలాగే కొన్ని కామెడీ సీన్స్ డీసెంట్ గా ఉన్నాయని అంటున్నారు. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం చాలా బాగుందని, కాకపోతే సినిమా మాత్రం స్లో నెరేషన్ తో సాగిందని రిపోర్ట్. ఓవరాల్ గా.. 'కింగ్ ఆఫ్ కొత్త' ఫస్టాఫ్ వరకు చూస్తే యావరేజ్ అనే రిపోర్ట్ వచ్చింది. మరి.. సెకండాఫ్ ఎలా ఉందో తెలియాలంటే కొంతసమయం వేచిచూడాల్సిందే.
Also Read