రాజ్ తరుణ్‌తో వరుణ్ కజిన్ సినిమా?
on Mar 21, 2020
మెగా ఫ్యామిలీలో హీరోలకు కొదవ లేదు. ఆల్మోస్ట్ డజను మంది ఉన్నారు. అలాగే, నిర్మాతలకు కూడా కొదవ లేదు. మెగాస్టార్ రీఎంట్రీ ముందువరకూ మెగా కాంపౌండ్‌లో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు మెగా నిర్మాతల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు వెంకట్ అలియాస్ బాబీ నిర్మాతగా మారుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు మరో నిర్మాత సిద్దు ముద్ద కూడా మెగా ఫ్యామిలీ మనిషే. అతను వరుణ్ తేజ్ కజిన్ అట. కజిన్ కోసం వరుణ్ డబ్బులు కూడా ఇచ్చాడట.
తన సినిమాతో కజిన్‌ని ప్రొడ్యూసర్ చేస్తున్న వరుణ్ తేజ్, అతడిని ప్రొడ్యూసర్‌గా నిలబెట్టడం కోసం మరో సినిమా సెట్ చేశాడట. ఫిలింనగర్ సమాచారం ప్రకారం... రాజ్ తరుణ్ హీరోగా వరుణ్ తేజ్ కజిన్ సిద్దు ఒక సినిమా ప్రొడ్యూస్ చేయనున్నాడు. సతీష్ కాసెట్టి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కొత్త కుర్రాడు మోహన్, ఈ సినిమాతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతాడట. రీసెంట్‌గా రాజ్ తరుణ్‌ని కలిసిన మోహన్, సిద్దు కథ వినిపించారట. సినిమా ఫైనలైజ్ అయిందని, త్వరలో వివరాలు బయటకొస్తాయని టాక్.
గతంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా బ్రదర్ నాగబాబు మాత్రమే సినిమాలు నిర్మించారు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరు మీద పవర్ స్టార్ బ్యానర్ పెట్టినా... ఎక్కువ సినిమాలు చేయలేదు. మెగాస్టార్ రీఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్ 150'తో రామ్ చరణ్ నిర్మాతగా మారాడు. నిహారిక నిర్మాతగా మారి యూట్యూబ్ కోసం వెబ్ సిరీస్ నిర్మించారు. సుష్మితా కొణిదెల కూడా నిర్మాతగా మారుతున్నారు. అల్లు వెంకట్, సిద్దు ముద్ద... ఇంకా ఎంతమంది వస్తారో చూడాలి. పవన్ కూడా సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
