సినిమాగా నవదీప్ వెబ్ సిరీస్?
on Mar 21, 2020
ఓ వెబ్ సిరీస్‌లో విషయం ఉందని అల్లు అరవింద్ భావించి, ప్రేక్షకులకు సినిమాగా చూపించడానికి తగిన మార్పులు చేయమని సూచించారంటే... ఆ వెబ్ సిరీస్‌లో కచ్చితంగా ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది. ప్రస్తుతం డిజిటల్ మీడియా, ఓటీటీకి ఆదరణ పెరుగుతోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల నిర్మాణం కూడా జోరుగా సాగుతోంది. సినిమా అంటే రిలీజ్ ప్రాబ్లమ్స్, థియేటర్స్ ఇష్యూస్ వంటివి ఉంటాయి. వెబ్ సిరీస్ అయితే అవేమీ ఉండవు. అందుకని, కొందరు వెబ్ వెబ్ సిరీస్‌లు తీస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
నవదీప్ హీరోగా 'రన్' అని ఒక వెబ్ సిరీస్ రూపొందింది. అల్లు అరవింద్ భాగస్వామి అయిన 'ఆహా' ఓటీటీ యాప్ కోసం తీశారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ తండ్రి సాయిబాబు, క్రిష్ స్నేహితుడు రాజీవ్ నిర్మించారు. ఇందులో పూజితా పొన్నాడ హీరోయిన్. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు. ఈ వెబ్ సిరీస్ చూసిన అల్లు అరవింద్, సినిమాగా మార్చమని అడిగారట. ఆ సినిమాను 'ఆహా'లో మాత్రమే విడుదల చేస్తారో? థియేటర్లలోకి కూడా తీసుకొస్తారో? వెయిట్ అండ్ వాచ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
