‘వారణాసి’ కథ చెప్పేసిన విజయేంద్రప్రసాద్!
on Nov 15, 2025
మహేష్‌బాబు, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్‌ని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారు. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు. అందులో భాగంగానే ఎన్నో విషయాలను పంచుకున్నారు రాజమౌళి. ఈ చిత్రాన్ని 2027 మార్చి 25న సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
‘వారణాసి’ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని మొదటి నుంచీ చెబుతున్నారు. అయితే ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది అనే విషయంలో అందరూ ఆసక్తిగా ఉన్నారు. రాజమౌళి చేసే ప్రతి సినిమా రిలీజ్‌కి ముందే కథను రివీల్ చేసేవారు. అయితే అది అన్ని సినిమాలకూ కుదరదు అని రాజమౌళి. అయితే కథా రచయిత విజయేంద్రప్రసాద్ మాత్రం ఈ సినిమా కథపై ఓ హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో 30 నిమిషాల లెంగ్త్‌లో మహేష్‌బాబు విశ్వరూపం చూపించారు. అందులో సీజీ లేదు, బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఏమీ లేకపోయినా మహేష్ తన నట విశ్వరూపం చూపించాడు. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు.. కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెల మీద హనుమాన్ ఉన్నాడు.. ఊపిరితో కర్తవ్యం బోధిస్తున్నాడు. హనుమకు రామనామం ఇష్టం’ అంటూ సినిమా బ్యాక్‌డ్రాప్ హనుమాన్ అని చెప్పకనే చెప్పారు విజయేంద్రప్రసాద్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



