అఫీషియల్.. వారణాసి రిలీజ్ ఎప్పుడంటే..?
on Nov 15, 2025

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కి ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్టుగానే 'వారణాసి' టైటిల్ ని ఖరారు చేశారు. అంతేకాదు, ఈ మూవీ రిలీజ్ డేట్ డీటెయిల్స్ ని కూడా రివీల్ చేశారు. (Varanasi)
హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో వారణాసి మూవీ మొదటి ఈవెంట్ ని భారీగా నిర్వహించారు. ఈ వేడుకలో టైటిల్ తో పాటు మహేష్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు.
Also Read: వారణాసి.. నెవర్ బిఫోర్ లుక్ లో మహేష్ బాబు
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రాజమౌళి, మహేష్ బాబు, ఎం.ఎం కీరవాణితో పాటు మూవీ టీమ్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. సినిమా విడుదల ఎప్పుడో చెప్పేశారు. 2027 వేసవిలో విడుదల కానుందని తెలిపారు.
2027 మార్చి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అంటే సరిగ్గా ఏడాదిన్నరకు 'వారణాసి' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



